పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జననాదికము

సర్వజిన్మాఘ బహుళై కాదశీ మంగళవారమున ఉదయాది 19 గడియలకు జ్యేష్టా చతుర్ధ చరణమున - క్రీ. 1888ఫిబ్రవరి 7 తేదిని-కృష్ణాతీరమున పెదకళ్ళేపల్లి గ్రామమున నేను జన్మించితిని. నా జాతకచక్రము జన్మకాల ఘటి కాది వివేచనలో నా బాల్యమున మా నాయనగారు వ్రాసి యుంచినది కలదు గాని- నేను దని నెల్ల నిందుదాహరింప వల దనుకొంటిని. జ్యోస్యులకు దాని పరిశీలనపు టలజడి వల దని నా కోరిక.

మా యూరు పూర్వము వేదశాస్త్రాది విద్యావిదులగు విప్రులతో సర్వ వర్ణ ములవారితో విలసిల్లినది. నా పసితనము నాఁటికిఁ గూడ వేద శౌత సాహిత్య విశారదు లనేకులు మా గ్రామమం దుండిరి. శ్రీవత్స గోత్రులగు వెలనాటి వైదిక బ్రాహ్మణుల వంశము నాది. శేషమ్మ మా తల్లి గారి పేరు. సుందర శాస్త్రి మా తండ్రిగారి పేరు. ఆ పుణ్యదంపతులకు నలువురు పుత్రులు, నలువురు కుమారైలును కలిగిరి. నేఁ టికిని సోదరలము న్ల్వురము సుఖముగా నున్నాము. నాకు అక్కగారు అన్నగారు నిద్దఱగ్రాజులు. తర్వాతివా రవరజులు. మా తల్లి పరమసాధ్వి.

మా తండ్రిగారు కొంత కొంతగా స్మార్త వైదిక జ్యౌతిష శిల్ప సంస్క్రుత సాహిత్యముల నేర్చిన వారు. ఆంధ్ర