పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిందు ప్రభాకర నామకుఁడ నగు నేనే కానవత్తును గాని, నాలోని దివ్య తత్త్వపుఁ బూవు వికాసము చెందిన పిదప, నది సువాసనను సౌకుమార్యమును వన్నెలను వెలార్పఁ జొచ్చిన పిదప, దాని గొని యానందింపఁ గోరువారికి నేను తత్ప్రుదర్శకుడనుగానే, యంగుళీగ్రాహ్య మగు తొడిమను గానే యడుగునఁ బడి యుండి కానవత్తును. అప్పుడిది ప్రజ్ఞా చరిత్రమే కాని ప్రభాకర చరిత్రము గాదు. ప్రభాకరచరిత్ర మయినను ఆ ప్రభాకరుడు తొల్లింటి నేను గాక వేఱొకఁ డే.

పరుషము నిష్ప్రయోజన మబద్ధ మనార్యము చేరరాదు నా
విరచనలందు, డెందము పవిత్రముగా విలసిల్లి సత్యసుం
దరము పరార్ధ యుక్త మగుత త్త్వమునే వెలయింపఁ గావలె౬,
గురుచరణారవిందములకుం బ్రణమి ల్లెదా నేర్మికై.

--- ---