పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

C. V. V.

నమస్కారము

ప్రజ్ఞా ప్రభాకరము


శ్రీ నిరంత రానందని శ్రేయసార్ధ
    సాధకము, సర్వకిల్బిషబాధకము, స
    మగ్రవిజ్ఞానదము, మహామహిమఘనము
    శరణ మగు మాకు సద్గురుచరణయుగము

ఉపక్రమము

సత్యజ్ఞానందాత్మకమగు పరతత్త్వము తత్ప్రుతి కూలగతితో అవివేకజీర్ణారణ్యమున జిక్కి చీకాకు పడుచున్న యనదును నన్ను త్రోవకు దెచ్చి కాపాడిన తీరును మిత్రగోష్టిలో విన్నవించుకొనుటకొఱ కే నా యీ గ్రంధ రచన ప్రయత్నము. దీని రచనమున నాకు పురుషోత్తముఁ డగు గాంధి స్వచరిత్ర రచనావిధానము దారిదివ్వె. గులాబి మొగ్గను గడుపునఁ బెట్టుకొని దాని గ్రంముకొని కఱకు నూగు తొడిమ ఱేకేతొలుత గాన వచ్చినట్టుగా ఉపక్రమమున