పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గారు, ఒక రాత్రి భోజనానంతరము విశ్రాంతిగా నిద్రపోబోవుచు నిట్లనిరి. "ఏమయ్యా! నాకు గలపరితృప్తి జార్జి సార్వభౌమునక్తెన నుండదు. ఈ పూట ఇచటకు బాధ పడుచు వచ్చినవా రెందరో నవ్వుచు బోయిరి నావలన ఈశ్వరుడిట్టి పుణ్యకార్యములను చేయించుచున్నాడు గదా యను తృప్తితో నేను హాయిగా నిద్రింపఁగలను. మరియు మన కేపూటకు వలయువాని నాపూటకు చుక్కలు చుక్కలుగా అమృతము స్యందించినట్లు భగవంతుఁ డనుగ్రహించు చున్నాఁడు. అప్పటికప్పడది యాస్యాద్యమ్తె హాయిని గొల్పు చున్నది. నిలువఁజేయువలె ననేపరితాపము గాని, నిలువచేసి దానిని సంరక్షించుకొనుటకు పడునవస్ధలుగాని నాకు లేవు గదా!" ఈ మాట విన్నవారికి ఎట్టి ఇక్కట్టులను, నాటంకములను, కష్టములను స్తెతము యోగి తనకు మేలు కలిగించు సాధనములుగ మార్చుకొనగలం డనుమహనీయ సత్యము స్పురించి తీరును!

  శ్రీ శాస్త్రిగారు నెఱపు ట్రీట్మెంటు పద్ధతినిగూర్చి పాఠకులుసరికి తెలియగోరుచుందురు. ఉభయసంధ్యల యందను నొకచో నుపవిష్టులై శాస్త్రిగారు వారు  గురు దేవులను  స్మరించి, నమస్కరించి, కనులు మూసికొని కొంత తడవు  అతర్విక్షణములో నుందురు. వారిలో నేమి జరుగునో మనకు తెలియరాదు. రుగ్మతాపీడితులుగూడ ఆ సమయములందు వారి సన్నిధిని  చేరి కూర్చుండి, వారి వారి యనారోగ్యములు