పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆహొ! నిజముగా నివి యన్నియు శాస్త్రిగారి కుండేడివా? ట్రీట్మెంటుకు వచ్చినవారివద్ద చిల్లిగవ్వ పుచ్చుకోనరు. ఎవర్తెన నాలుగుపండ్లు తేచ్చిరో వారి కనుమానము! ప్రతి ఫలము పుచ్చుకొని ట్రేట్మెంటు చేయు మనుచున్నారని. తెల్ల వారుసరికి, సాయంకాలమగుసరికి ట్రీట్మెంటు వేళకు దహదహ మని యాకలి! యోగసాధనకన్న నాకు చూడగా వారి సంసారసాధనయే కష్ట మనిపించినది. ఆ పేదరికముగూడ వారిని బాగావడభీముఖులనే గావించెడిది. ఇన్ని చిక్కులలోను వారు చలింపక "భారములన్నియు నీప్తెన వ్తెచి నిర్భాయుడన్తె యున్నానులే" అనియో, "తరము గాని ఎండవేళ కల్పతరు నీడ దొరకిన ట్లాయే ఈ వేళ!" అనియో గొంతెత్తి పిల్లవానివలె పాడుచుండఁగా మనము వేరొక ప్రపంచములో నున్నట్లు తోచెడిది. ఆ పూటకు బియ్యము లేక, భగవంతుడేమి చేయునో చూతమని జరపిన కథలుకూడ కలవు. ఆపూట కెవరో ఇంతకన్న భాగ్యశాలి నెల్లూరినుండి శేరున్నర బియ్యము మూట గట్టుకుని పదిగంటలు ప్రోద్దేక్కునప్పటికీ తెచ్చి యిచ్చెను. ఇతఁడాదినము రావలసినవాఁడుగాదు. వీరి యవసరము తెలిసినవాఁడునుగాదు. మరియెక నాఁడు భోజనమునకు పూర్వమేయని జ్ఞాపకము-ఏదో మాటాడుచు ఇపుడు అనాసపండు తినిన బాగుండును అనిరి శాస్త్రిగారు, ఇంతలో తలుపు తెరచుకొని రాజమండ్రినుండి ఒకమిత్రుడు అనాసపండ్ల బుట్టను తెచ్చెను. లేమిడిచే నలిగులి యగుచున్నను దాని నుండియే ఒక వింత తృప్తీని కల్పించుకొనేడివారు శ్రీశాస్త్రి