పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కర్రలు వారికడ నుండెడివి. ప్రార్ధనా మందిరములో కూర్చుండుటకు రకరకముల పొడల జింకలచర్మములు, పెద్ద పులిచర్మములు తెప్పించేడివారు, వారికడకు తెలుఁగునాటి నాలుగుమూలలనుండి అన్ని వర్ణములవారును, అన్ని తరగతుల వారును వచ్చెడివారు, విరందఱిని తమవచోచమత్కృతితో నలరించేడివారు. మరిము వారు వారు వాడిన క్రొత్త మాటలను గూర్చియు, వాని ఆనుపూర్వినిగూర్చియు అప్పటి కప్పడే ప్తెలాలజిని నిర్మించేడివారు. దోసె అనగా రెండు చేతుల వెడల్పుగల దనియు దో = రెండు + సెయ్ = చేతులు, అరసె యనగా అరచేతి వెడల్పు గలదనియు (అర +సెయ్) అనియు నా భక్ష్యములకు క్రొత్తరుచి కలుగునట్లు చెప్పేడి వారు. ఇంక పండ్లుకోయదగిన పరువనులు, వాడఁదగిన రీతులు, కూరల రుచుల బహుపరిశీలనతోచెప్పెడివారు. గుంటూరు, కృష్ణాలలోని గోగుపచ్చడిని గూర్చి 'కడుపుతిపు' అను చిన్న పద్యకావ్యములో వారు ఇట్లు వ్రాసిరి.

" పయరకూర వేచి పచ్చిమిరెపండ్ల నుక్కళించి పోసి యూరనిచ్చి

కొంత కొంత పొగిపికొను గోఁగుఁ బచ్చడిచవికి నింక నోరు చివికితిరు."

 ఈ యోగసాధకులకు పుష్టికరమ్తెన యాహారము అవసరము. ట్రిట్మెంటు  చేయువారికి ఈ సౌకర్యము మిక్కిలి  యవసరము. కాని మదరాసులోనున్న ఆరోజులలో శ్రీ శాస్త్రిగారికి ఏంబదిరూకల వేతనము, పెద్ద కుటుంబము. ఆ ప్తెన వచ్చిపోయేడివారు. సగము ప్తెగా యింటి అద్దెకె ఖర్చు, ఇక  బియ్యము, పప్పు, కూరలు, పాలు, నేయి, కట్టెలు, బట్టలు,