పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రీస్తు ప్రభువుగూడ ఆత్మశక్తి చే అనేకులను నిరామయుల నొనర్చెనని విందుము. క్రైస్తవులలో నిట్టి నమ్మకమును, అనుభవములును నేఁటికిని గలవు. సెంటు బొర్నాడొటే గీతము (The song of st Berna dotte) అను నవలలోని వాస్తవిక కధయంతయు నిట్టిదే. ఫ్రార్సులోని LOURDES అను పట్టణములోని మఠము వద్ద నిత్యము అనేక దేశముల నుండి రోగులు వచ్చి ప్రార్దనలో పాల్గొని నిరోగు లగుదురట! అచట ప్రవేశము బడయునపుడే రోగిని ఒక డాక్టర్ల సంఘము పరిశీలించి రోగవివరములను వ్రాసి యుంతు రట! పిమ్మట వారు వెడలిపోవు నప్పటి శరీరస్ధితిని పరిశీలించి అది ఎంత వరకు నిజ మగుమార్పో కాదో నిర్ణయించి రికార్డు చేయుదు రట. జీవవైద్య శాస్త్రములలో నగ్రశ్రేణికి జెంది నోబెల్ బహుమతి బడసిన అలెక్సిస్ కెరోల్ అను మహనీయుఁడు MAN THE UNKNOWN అను గ్రంధములో నిట్టి చికిత్సను గూర్చి ఇట్లు వ్రాసినాఁడు.

   "... The most important cases of miraculous healing have been recorded by the Medical Bureau of Lourdes. Our present cmnception of the influence of prayer upon patho logical lesions is based upon the observation of patients who have been cured almost instantaneously of various affecttons, osteites,suppurating wounds, lupus, cancer, etc-  The only condition in dispensable to the occurence of the phenomena is prayer. But there is no need for the