పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మువ్వురకు నాశ్చర్యము కలిగెను." ఎట్టి వ్యాయామము లేకయే ఇంతటి శ్వాస యెట్లు కలిగినది? చూచితిరా! ఇదంతయు మాష్టరుగారి దివ్యానుగ్రహము!" అని శ్రీ శాస్త్రిగా రనిరి. మాష్టరుగా రన వారి గురుదేవులు. శ్రీ శాస్త్రి గారు తమ వలన బాగాయిన వారందరితోను తాము నిమిత్తమాత్రుడనియు, మాష్టరు గారి యనుగ్రహమే సర్వని ర్వాహక మనియు చెప్పెడివారు.

నే నచట నున్న దినములలో ట్రీట్మేంటుకు వచ్చెడివారు. వారిలో రిక్షాలాగువారు, కస వూడ్చుకొను వారు, ఆఫీసుర్లు, ఉపాధ్యాయులు, యునివర్సిటీ ప్రొఫెసర్లు, డాక్టర్లు, ఇంజనీయర్లు, లాయర్లు, సనాతనులు, శాయిబాబా మత ప్రవర్తకులు, కమ్యునిస్టులు, విద్యార్ధులు, కాంగ్రెసు నాయకులు మొదలగు పలు తెఱఁగులవా రుండెదివారు. తేలుక్జాటు, ఒడలు కాల్పు, గాలి సోకు, టైఫాయిడు, పరిణామశూల (Gastric ulcer) పైత్య కోశమున రాళ్లు (Gall stones), నంజు, జలోదరము మొదలగు అన్ని బాధలను శ్రీ శాస్త్రిగారు యోగ ట్రీట్మేంటు తోనే చక్క జేసెడివారు.

       వీరిలో మిక్కిలి దయనీయుఁడగు నొక బాలుని గూర్చి వ్రాసెదను. ఆ బాలుని తండ్రి రిక్షలాగు వాఁడు. నాలుగు రోజుల క్రిందట ఆ బాలుఁడు కాలు జారి పడెను. అప్పటి నుండియు వానికి స్మృతి కలదు గాని నోట మాట లేదు. కనుపాప లొక ప్రక్కకు తిరిగి వెర్రిగా చూచును. మూతి వంకరపోయి యున్నది. మెడ ఒక ప్రక్కకు వాలెను.కాలు