పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జోళ్ళకు నిండు కప్పు" అనిరి. మరునాఁడట్లు చేసితిని." ఇడ్దేనలు మాత్రమేనా? ఈ శాస్త్రము నీకు తెలియదు. విను! మొదట రెండిడ్దేనలు. వాని పై కొంచెము కాఫీ, ఆ మిఁద నుప్పుమావ్, దాని కాచ్చాదన దోసె, ఆ కప్పు మిఁద ఒక కప్పు కాఫీ పోయవలె" నని కడుపు చెక్కలగు నట్లు నవ్వించిరి. ఆ యూపుతో పూట కెన్మిది ఇడ్దేనలు, భోజన మున నరవీ శెడు కూరలు, రెండు కప్పుల పెరుగు; మధ్యాహ్నము నిద్రలేచి అరడజను పేవాజప్పళపండ్లు, కిస్మిస్, అంజూరా, ఆపిల్ఫలములు; సాయంత్రము నాల్గుబోండాలు, కాఫీ; రాత్రిభోజనములో మామిడిపండ్లు- ఇంతవఱకువచ్చితిని. ఈ రాకాసితిండి నేఁడు నేనేనమ్మఁజాల నట్లున్నది. లేకున్న నిరువది రోజులలో నిరువది పౌనుల తూకము పెరిగి యుండ నను కొందును!

ఒక రోజున అన్నామలై విశ్వవిద్యాలయములో గణిత శాస్త్రాధ్యాపకులుగా నున్న ప్రొఫెసర్ నరసింగరావుగారు వచ్చిరి. వారుగూడ యోగమిత్ర మండలిలోని వారే. శ్రీ శాస్త్రి గారి ఇంటనే బస. ప్రసంగవశమున నా కధయంతయు శ్రీ శాస్త్రిగారు చెప్పిరి. వా రాశ్చర్యముతో వినిరి.ఈ మాటలు జరుగుచున్నంత కాలము నాలో గుబగుబ మని యేదో సంచలనము జరిగెను. ఉచ్చ్వాస నిశ్వాసములు దిర్ఘములాయెను. వెన్నెముక నిట్టనిలువున బుసగొట్టు త్రాచువలె నిలిచెను. రెండు భుజములు వెనుక కొత్తుకొని రొమ్ము విప్పారెను. శ్వాసను కొలుచు పద్ధతి నాకు తెలియదు గాని, కొలిచినచో నది రెండు బారలైన నుండు నేమో! మా