పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెళ్ళినపిమ్మట గూడ చాల ప్రొద్దు పోవువఱకు వారి వారి రోగ కారణాదుల నాత్మోద్బోధనము తెలిసికొనుటతో నిదుర యుండదు. ఒకప్పుడొక నిదురపోయి లేచి తెల్లవారు లా చింతతోనే కాలము గడపుదురు. ఇందుచే ప్రొద్దెక్క లేచుట జరిగెడిది. వేకువనే ఆచారపరాయణువలె వేషము సవరించుట కెక్కడ! అన్ని ఆచార ములను వారు జీవకారుణ్య యజ్ఞాగ్నిలో వ్రేల్చిరి.

దంతధావన చేసీ చేయుటతో నేఁ దెచ్చిన కమలా ఫలములను రుచి జూచి," బాగు న్నవి! కాని లోన డొల్ల జాస్తి. రసము తక్కువ" యనిరి. ప్రతి వస్తువును పరిశీలించి నాణ్యము తేల్చుట వారి కొక పరిపాటి.

ఆపిమ్మట నాకు యోగచికిత్స నిచ్చుటకు వారు సమ్మతించిరి. కాని ముందు నా భోజనవసతి యెట్లని యడిగిరి. హొటలులో నుందు ననఁగానే వారి కతృప్తి కల్గెను. హొటలులో ఆహారము ససిగా నుండదని వారి బెంగ. మామూలు సాంబారు మెతుకులు గాక మంచి నేయి, కూరలు, పాలు, పండ్లు తీసికొనవలె ననిరి." ఈ యాహరముతో నీ జబ్బు కుదురునను కొనవద్దు. కుదుర్చునది సర్వకర్తయగు నిశ్వరుడే! నీ శరీర పుష్టికి ఈ తిండి కావలయును" అని చెప్పిరి. నర్సింగుహొము సంగతి చెప్పగా అందు చేరవల దనిరి. వారి మాతజాడను బట్టి నా యనారోగ్యము చక్కబడు నని వారి తలంపుగా నేను గ్రహించి సంతసించితిని.