పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టకు కొన్ని తీయని మందుల నిచ్చి ఆహారవిషయములో కొంత స్వేచ్చ నిచ్చెడివాఁడు. కాని లాభము లేకపోయెను. తిరిగి అల్లో పతీకి చేరితిని. అప్పటికి నా శరీరస్థితి చాలమార్పు చెందెను. ఇరువది పౌనుల తూకము తగ్గినది. సాయంకాలమునకు 99.5 జ్వరము వచ్చెడిది. మానసికముగా ఎట్టి నిబ్బరమును లేదు. నరములు జిగి తగ్గి స్వల్పా వేసమునకే శరీరము తాళ లేకుండెడిది. నిద్ర లేదు. ఏమి తిన్నను వంట బట్టదు. ఈ స్థితిలో అల్లోపతి వైద్యము కొలఁదిగా సాయపడెను కాని వ్యాధి బోధపడ దు. ఎచటనైన భయపడతి నేమో యని వైద్యుఁ డనును.

ఈ స్థితిలో చెన్నపట్నములో లాఅప్రెంటిసు పరిక్షకు వెళ్ల వలసి వచ్చెను. నేను రైలు దిగి ట్రాము బస్సులలో ఎక్కగలనా యను సందేహముతో నుంటిని. తుద కెట్లో చెన్నపట్నము చేరి స్టేషనువద్దకు రావించుకొన్న మిత్రుని సాయముతో హొటలు చేరిపరిక్షలుగించుకొంటిని. తరువాత పేరుగన్న ఒక డాక్టరుగారిని చూచితిని. ఆయన కొక నర్సింగుహొము కలదు. రోజు కైదురూప్యముల నిచ్చి పది రోజు లందున్న నే గాని రోగనిదానము తెలియ దనిరి. నే నందు చేరెడి దినము స్థిర పఱచుకొని హొటలుకు వచ్చితిని.

గుంటూరు నుండి బయలు దేరునపుడే శ్రీ శాస్త్రిగారి యోగమాహాత్మ్యమును గూర్చి ట్రీట్మెంటును గూర్చి శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణగారి వలన తెలికొంటిని. ఎందుకైన మంచిదని శ్రీ శాస్త్రిగారికి వారికడ నొక పరిచయ లేఖను తీసి