పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శిష్యులైన చెన్నపురివాసి శ్రీ కంభంపాటి సత్యనారయణ శ్రేష్టి భరించి గురుదేవుల యెడఁ గల భక్తి ప్రపత్తులను వెల్లడించుకొనిరి. వీరి వృత్తి వెన్న వ్యాపారము. హృదయ ప్రవృత్తియు నవనీతసమానమే! శ్రీ శాస్త్రిగారు చెన్నపురి విచ్చేసినపు డెల్ల అచటి ఆప్తులందరును వీరియింటనే సమావేశమై వీరి యాదరణకు పాత్ర మగుచుండెడివారు. నేటికిని వారి యాదరణకు మేము ఋణపడియున్నాము.

శ్రీ శాస్త్రిగారితో నాకు ప్రధమపరిచయ భాగ్యము 1939మే నెలలోకల్గెను. అప్పటికి సుమారు పది నెలల నుండి నేను తీవ్రానారోగ్యముతో పీడింపబడుచుంటిని. నా యనారోగ్యము తొలుత 106 డిగ్రీల మలేరియాతో నారంభ మైనది. అంతటిలో నాగిన నెట్లుండెడిదో! ఆవైద్యపద్ధతిలో క్వైనా వాడుదు రనియు, అది శరీరమునకు మంచిది కాదనియు,హొమియోపతి వైద్యములో క్వైనా వాడరనియు, ఆ పద్ధతి శ్రేష్ఠ మనియు ఎట్లో తలకెక్కెను. దానితోమరిరెండు నెలలుగడచెను. లాభము లేదు. పిదప ఆయుర్వేదము పై చిత్తము ప్రసరించెను ఎన్నో చేదు మందులు మ్రింగితిని. అందు కలకత్తావారి పంచతిక్త మని యొకటి గలదు.పేరుకు పంచాతిక్తమే కాని నిజముగా నది ప్రపంచతి క్తము. పగవానికైన వలదీ చేదులు! ఆ మిఁదట కేవలము నాటుమందులు వాడితిని. ఆ వైద్యుఁడు చురుకైన వాఁడే! నాటుమందులపై నాకుఁ గలయనాదరణను పోగొట్టు