పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బంటి నల్ల రేగడి బాడి. జోడెద్దుల బండి సైతము నడువ వీలు లేదు. కాలుదీసి కాలువేయ సాధ్యము గాదు. ఇట్టి మిత్తి యడకత్తెరలోఁక్కికొని అఱువదేండ్లవృద్ధు, భారపు మానిపి యగు శ్రీ శాస్త్రిగారు తీవ్ర జ్వరముతో నింటికిఁ జేరు కొనిరి. అప్పటికే వారి యారోగ్యము పూర్తిగా చెడినది. దానిని లెక్కచేయక నిరంతరము మంచము మిఁదనుండియే చివరి వఱకు వారి మామూలు కార్యముల నిర్వహించుకొనుచుండిరి. వారు తమ యోగకార్యముల నిర్వహించుకొని చుండిరి. వారు తమ యోగ మహాత్మ్యమున పలువురను మృత్యుదంష్ట్రుల నుండి వెలికి లాగిరి. అట్టి వార మనేకులము వారి చుట్టు నుండియు తుదకు నా మహానీయుని దక్కించుకొన నేరమైతిమి. ఈ హఠా ద్వార్త విన్న మహాకవి శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారు చకితులై "తుదుకు నిన్నే జయించె మృత్యువు మహాత్మా" యని అప్రయత్నముగ వగచిరి. శ్రీ సత్యనారాయణగారు తమకు తెలియక యే, శ్రీ శాస్త్రిగారి ప్రేమ పాత్రులందరు ఆ నిముసమున భావించినదే పల్కిరి. అస్సాము భూకంప ములో హిమాలయ శృంగములు కొన్ని యదృశ్యమైన వన్న వార్తలతోపాటు, శ్రీ శాస్త్రిగారి నిర్యాణ వార్తను మేము వార్తాను మేము వార్తాపత్రికలలో జూచి వాపోయితిమి.

   తుదకు వారెంతో మక్కువతో బృహద్గ్రుంధముగా రచింపఁజూచిన ప్రజ్ఞాప్రభాకర  మీతీరున నసంపూర్ణముగా, దుఃఖపుపుక్కిలింతగా ప్రకటింప వలసి వచ్చినది. దీని ముద్రణకగు వ్యయ మును శ్రీ శాస్త్రిగారి కిర్వదియేండ్ల నుండి ప్రియ