పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శాస్త్రిగారు కొన్ని గంటల కాలము వ్యయించి ఒక చిన్న పాలరాతిముక్కను తెచ్చిరి. దానిపై నేదో చెక్కడపు భాగము గలదు. ఈ రాత్రికే వారు తిరుపతి ప్రయాణము. సామానుల సర్దుగడలో దానిని మఱతు రేమో యని పలుమారులు సరిచూచికొనిరి. గాజుకు ప్పెలను భద్రము చేసినంత జాగ్రత్తతో దానిని సర్దించిరి. మాకీ యాందోళన బోధపడలేదు." ఇదియమూల్యశిల్పము. డూబ్రేలు అయినచో దీనికి పదివేలు రొక్క మిచ్చును" అని రైలుకడఁ జెప్పిరి. ఈ చిన్న వస్తువు మాటయే యిటులుండ వారు సేకరించిన మ్యూజియమునకు విలువ గట్టుట యసాధ్యమని తోచును.

   ఇప్పడీ శిల్పకళాఖండము లన్నియు తిరుపతి దేవస్దానపు మ్యూజియములో మూగవోయి యున్నవి. వాని కాలనిర్ణయముఁజేసి, వాని సాంఘిక రాజకీయ ప్రాధాన్యతను, కళా ప్రాశ స్త్యమును గుర్తించి, వానిని పలుకు బొమ్మలనుగా జేయుగుతురబాధ్యత దేవస్దానము వారి యెడఁగలదు.
   ఇటు మ్యూజియముకై తిరుగులాట తోను, అటు అపూర్వ గ్రంధసంస్కరణ ముద్రణములు యొత్తిడితోను నలిగులియై శ్రీ శాస్త్రిగారి యారోగ్యము కొంత చెడినది. ఇంతలో గుంటూరు జిల్లా ఎద్దనపూడి యను గ్రామములో నొక బావిలో నేవో మహత్తరశిల్పములు గుప్తపఱుపఁ బడెననియు, వానిని సేకరింపవచ్చుననియు ఆసవెట్టిదుర్విధి శ్రీ శాస్త్రిగారి నటకుఁగొంపోయెను. జడివాన మోఁ కాటి