పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అని. ఆనాఁడే ఆతఁడొక కల్పనము చేసెనఁట! శ్రీవారి ముఖ్యశిష్యులలో 'అంబష్టుఁ' డొకఁ డుండెను అనుటకు ' అమ్మట నొరువన్' అని యుండగా నాడి కాపి వ్రాయుచున్న వాడు గోపీనాధ రావను శ్రీవారి శిశ్యుఁడే నాడి కారునివంటి వాఁడే వాక్సహయము చేయఁగా ' పండిత నొరువన్ ' అని మార్చి వ్రాసెనఁట! దక్షిణదేశమున ' అంబష్టుని' పండితుఁడనుట పరిపాటి- గడగడలాడుచు దీని నాతఁడు శ్రీవారికి నివేదించెను. ఎప్పుడుగాని యిట్లు మార్పవల దని శ్రీవారు శాసించిరి. కడకు శిష్యగోష్ఠిలో నీ విషయమును దెలిపి ఇదివఱకు వ్రాసిన భాగమున నిం కే మేని మార్పులు చేసినాఁ డేమో పరిశీలిం పవలసియున్నది యని దాని కాపి లెవరెవరు వ్రాసిరో, వారివారి కాపీలతో నందఱను, మూలముతో నాడి కారుని రమ్మనిరి. ఎవ్వరు నేమి కల్పనము జరపిరో యెఱుఁగరు గాన తమ నిర్దుష్టతను నిరూపించుకొనుట కందఱు వచ్చిన తర్వాత మూలమును, కాపిలను వశపఱచుకొని కట్టికట్టి యట్టుక మీద దాచి వైచిరి. ఇక నాడీ చదువవల దనిరి.

   "వ్రాయసగాఁ డేమేని మార్పు చేయవచ్చును. మాతృక వ్రాసిన వాఁడే యెఱుక చాలక యేమేని తప్పు వ్రాసియుండ వచ్చును. గ్రంధ కారుఁడే యజ్ఞఁ డై తప్పిదపు రచనము చేసియుండవచ్చును.  దానికి పరమప్రామాణ్యము కల్పించుకొని మీరు చదువ రాదు. నాదగ్గఱకు మీరు వచ్చి శిష్యులగుట నాడి మూలమునఁ గాదు. నాడిఁ జూచుట మీరు నా శిష్యులయినతర్వాత నే. ఏ కారణములతో మీరు నాశిష్యు