పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నన్ని విషయములు విస్పష్టముగాఁ దప్పిపోవుచుండును. ధ్రువ నాడిలో నట్లు జాతకము తప్పి పోవునట్లు గుర్తించి యడుగఁగా నపుడు సరిపోయినదిగా నింకొక తాటియాకు దొరకును. అది పూర్వపుటాకు కంటె కొంత హెచ్చు భాగములు సిరిపోయి నదిగా నుండును. కొన్నాళ్ళ కిదియు తప్పి పోవును. ఇట్లు ఆనాడి, తత్పాఠకుఁ డు, జాతకుఁ డు ఉన్నంత దాఁక చదువుచునే యున్నచో జాతకము సరిదిద్దుకొనుచునే యుండ వచ్చును. కాని రే పిట్లు జరగఁ గల దని సునిశ్చితముగా నే నాది గ్రంధము గాని చెప్పుట నే నెఱుఁగను. ప్రత్యుత తద్విరుద్ధముగా జరగుటయు నెఱుఁగుదును.

   పర్యాలోచించి చూడఁగా నొక్కొకప్పుడా గ్రంధ మాయా వేళకు కనుకూలముగా నిర్మిత మగుచుండు నేమోయని తోఁచును. ధ్రువనాడిలో జాతకము తప్పినపు డెల్ల క్రొత్త జాతకము దొరకు చుండుట యిట్టిదే . కాన యా నాడి నుపయోగించు గ్రంధ స్వామి దానిని సృష్టించుచుండెనని కొంద ఱందురు. నాడి తప్పునప్పు డెల్లఁ దద్గ్రం స్వామిని కొందఱు తస్కరుఁడు, తప్పుడు సృష్టి చేసె నని నిందించు చుందురు. దానిని జదివినందు కాతఁడు కొంత సొమ్ముగయి కొనుచున్నాఁడు గాన యక్రమముగాఁ నాతఁ డా నిందకు బాల్పడ వలసి వచ్చుచుండును. అంతేకాని నిజముగా నా గ్రంధ స్వామి దానిని సృష్టింపఁ జాలఁ డగుట నేను బాఠముగా నెఱుఁగుదును. ఆతని దృష్టి కా యక్షరము  లట్లు కానవచ్చె నని కాని యాతని తల కట్లు శ్లోకపరంపర తోఁ చె నని కాని వాకొనుట యుక్తము.