పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రముతో నే మీ శిష్యత పడయవలె నని నాయాశ' యంటిని.' సరే కాని నేఁడు ఎనిమిది గంటలకు నీ భార్యకు ఇ౯ సియేష ౯ జరుగును. అందుకు వలయు సన్నాహములు జరపుము, అందుకై నీ వేమియు వస్తువులు తీసికొని రా నక్కఱ లేదు. రాధాకృష్ణనితోను, మహాదేవయ్యరుతోను, చెప్పి ఫారము వగైరాలు ఫిలప్పు చేయించుము ' అని శయ్య వీడి లోని కరిగిరి.

   నే నడిగిన దాని ననుగ్రహించినట్లు త్తర మియాక యర్ధింపవలసిన దే అయినను అప్పు దర్ధింపని దాని ననుగ్రహించుట జరిగెను గదా యని వింత చెందుచు నేనును వెలికి వచ్చి కాల కృత్యములు నిర్వర్తించుకొని, యంతలోనే యోగశాలకు విచ్చేసిన మిత్రు లిర్వురకు శ్రీవారి యాజ్ఞను దెలిపితిని. వారు నవ్విరి. ఎనిమిది గంటలకు సర్వము సిద్ధమయ్యెను. నాఁడు శ్రీవారియింట వారి యారోగ్యమును గూర్చి శ్రీవారు తీవ్ర ప్రజ్ఞతో నుండిరి. ఎనిమిది గంటలకు ఇ౯సి యేష౯ జరగినది.
   మాతృశ్రీగారు యోగ సాధనోపక్రమమునకు ముందు ఇడ్డనలు, కాఫీ, ఆహారము తిసికొనుటకై తెచ్చి దగ్గఱ నుంచిరి. అది తెలియక యీక్రొత్త యువిద యాభ్యాసవిధానము నారంభించెను. అయుదు నిమిషములలో శరీర మెల్ల కొయ్యబాఱి కదల మెదల వీలు లేకుండ బిగిసి కొని పోయెను. దగ్గఱకు వచ్చి సచ్చిదానందస్వాములవా రాస్థితిని జూచి పిలిచిరి. కనులు తెఱవఁజాల  దయ్యెను. వారు మాతృశ్రీ గారిని