పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాలి విచుచుండఁ గా, నొక గోల్డు మెడల్ మడత మంచము మిఁద పలుచని పడుక మీదను, క్రిందను చల్లినమల్లెపూవు లున్నవి. పట్టుతలగడ గలదు. తెల్లని పలుచనిపట్టు సెల్లా కప్పుకొని యుండిరి. మంచమునకు దోమ తెరక ప్పుండెను. అదను ప్రతీక్షించుచు వారు కనులు దెఱచి లేవ నుంకించునంతలో నేను చేర నరిగి పాదములు స్పృశించి నమస్కరించి తిని.' రాత్రి యెక్కడ శయనించితి' వని యడిగిరి. ఇంటిలో స్ర్తీలతో స్ర్తీయు, వాకిటియరుగు మిఁద నేనును శయనించుట తెల్పితిని. చప్పరంచి ' నా మాట పాటింపక పోతివి గదా' యనిరి. సిగ్గుతో తల వాంచితిని.' సరే! కానిలే! ఏమి విశేషము ' అనిరి.

' మి దివ్యానుగ్రహమున నే నారోగ్యవంతుఁ డ నయితిని. నా కీయోగమార్గమున ధన్యత చేకూరును. నాకు శరీర మొసఁగిన మాతల్లి దండ్రులు వృద్ధులు. ఎప్పు డేమిజరుగునో? వారికి మిశిష్య తన నుగ్రహింప వేఁడుచున్నాను. వారిక్కడికి రాఁజాలరు' అంటిని.' వారివయసెంత' యనిరి.' మాతండ్రి గారి వయసు డెబ్బది దాటినది'యంటిని.' అంత వార్ధకమున నున్న వారినిగూర్చి యనుతపింతువే? చిరకాలము నీతో జీవితము గడపవలసిన నీభార్యను గూర్చి యడుగ వేమి' యనిరి.' చిన్న వయస్సులో నున్న యీయువిద నాతో నెప్పుడు పట్టిన నప్పుడు మి దర్శనమునకు రాఁ గల్గును. కాన యెప్పుడయిన మీ శిష్యతానుగ్రహమున కర్హురాలు కాఁగలదు. చాల వార్ధకమున నున్నవారని, ఎప్పు డేమగునో అని, వా రీశరీ