పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేఁటి రజాకారు కమ్యునిస్టు దుండగములకును భేదము కన్పట్టదు.మానవతలోని పశుత్వ మవిచ్చిన్నముగ నాఁటినుండి నేఁటి వరకు సాగుచునే యున్నది! తనకు మంచిదని తోఁచిన దాని నితరులచే నంగీకరింపఁ జేయుటకు మానవుఁడొనర్చు సాధనలో హింసాకాండను వర్జింప నేరఁడా?

   ఈ శిలా లోహ విగ్రహములే గాక శ్రీ శాస్త్రిగారు కాళహస్తి సంస్ధాన భాండారమంతయు శోధించి తత్సంస్దానాదీశ్వరుల యుదారానుమతితో ఎన్నో అముద్రితగ్రంధములు, చిత్రములు, పూర్వపు వీరులు ధరించిన కవచఖడ్గాదులు సేకరించిర ఆంద్రప్రభ సంపాదకులగు శ్రీనార్లవారి సహాయమున బందరు నుండి  శ్రీ కోటసుబ్బారావుగారలు బహుకాలము శ్రమించి సేకరించి ప్రాణతుల్యముగ భద్రపరచుకొన్న అమూల్య చిత్ర ప్రతిమాదుల మ్యూజియమును తిరుపతికి తరలించిరి.
   ఈ పని యంతయు నొకప్రక్క- మఱియొక వంక తిరుపతి దేవస్ధాన ప్రాచ్యకళాపీఠ యాజమాన్యమున శ్రీ అన్నమాచార్యా వర్ధంతి జరుపుట, కీర్తనలు ప్రచురణ, పావులూరి గణితము, ఉత్తరహరివంశము, లక్షణోద్ధారము, నన్నయకు పూర్వపు ఆంధ్ర భాష ఇత్యాదుల పరిష్కరించుట, వ్యాఖ్యానించుట, సమకూర్చుట, పరిశోధించుట జరపుచు, నన్నిచోడుని కుమారసంభమునకు వ్యాఖ్యానము రచించుట గూడ ప్రారంభించి యీ కార్యముల నన్నిటిని నేక కాలమున సవ్యసాచి వలె శ్రీ శాస్త్రిగారు నిర్వహించిరి.