పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

౨౯

ఇల్లాలి యినిసియేషన్

మద్రాసు పయనము. నే నింటిసామాన్లు నన్నింటిని రైలులో మద్రాసు పంపి సకుటుంబముగా తంజావూరి నుండి కుంభకోణమునకు వచ్చి నాయరోగ్యాది విషయములను శ్రీ వారి కెఱింగించితిని.

నాఁడు సాయంకాలపు యోగాభ్యాసము ముగిసిన తర్వాత నన్నుఁబిలిచి శ్రీవారు' నీ వీరాత్రి నేను సదా వర్తిల్లు చుండు యోగాలయపు గదిలో, నేను విశ్రమించు బల్ల మిఁదనీ భార్యతో శ యనించుము. నే నిప్పుడు ఇంటనే శయ నించు చుంటిని' అనిరి. నేను గడగడలాడి సిగ్గుతో అంగీకార సూచకముగా తల వాంచితిని. కాని నాకు తర్వాత చాల వెఱపు గల్గెను. అది గురు దేవులు శయనించుగది. అందు వారు విశ్రాంతి గొనుబల్ల! అందు నేను శయనంచుటా? అందును సద్వితియముగా! అని వణకితిని. ఈయాజ్ఞ నాలోనే జిర్ణించెను. వారితోనే భోజనము చేసితిని. వారి యింటిలోని యాడువా రందఱు మిత్రులతో వీధియరుగుమిఁద శయనించితి. రేయెల్ల శ్రీవారి యాజ్ఞను గూర్చి పర్యాలోచనమే! ఉదయము తెలతెలవాఱుచుండఁ గా తలుపులు తెఱచిన తోడనే లోని కరిగితిని.

శ్రీవారు ఇంటిలో విశాలమయిన మండువానిలో చంద్ర నక్షత్రాదులు నీలాకాశము గోచరించుచుండఁ గా చల్లని