పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తోడనే జ్వరపడి జ్వరముతోనే ప్రతివారము వచ్చుచుందు ననియు చెప్పిరి. వారు కుపితు లయి యుండిరి.

1916 క్రిస్ మస్ సెలవులు వచ్చినవి. నేనా సెలవు రోజులలో కుంభకోణముననే శ్రీవారి సన్నిధి నుంటిని. 30 తేది దాఁక నాకు జ్వరమే. 31 వ తేది నాకు విరేచనము లెడ తెగ కుండ కాఁజొచ్చినవి. నల్వది యేఁ బది తూరులయ్యెను. సగ్గుబియ్యపు జావను మిత్రులు మహ దేవయ్య గారు తెచ్చి యిచ్చిరి. త్రాగితిని గాని కదల శక్తి లేదు. నాఁ డుదయము నేను వెళ్ళి తీర వలెను. శ్రీవారి కీ యసం దుర్భము తెలిసెను. రామ చంద్రయ్యరుగారు అనుముఖ్య శిష్యునిఁ బిలిచి ప్రభాకరునికి విగర్ సప్లైయగుటకు ట్రీట్చేయమనిరి. ఆతఁడు పండుకొన్న నేను లేచి కూర్చుండి, కూర్చున్న నేను లేచి, లేచిననే నిటుదిరిగి, తిరిగిన నేను పర్వెత్తఁగలిగి యుత్సాహ శక్తిపూరితుఁడ నయితిని. కొంత పర్వాతోనే నే వెళ్ళి శ్రీవారి పాదములు వ్రాసితిని. రైలు వేళగుచున్నది గాన వెంటనే స్టేషనుకు పోమ్మనిరి,' ఇఁక నుండి యానారోగ్య ముండదు. వారము వారము రా నక్కఱ లేదు. రెండు రోజులు సెలవు కలసి వచ్చిన రమ్ము, పగలు హాయిగా భోజనము చేయుము. ఉదయము, మధ్యాహ్నము లఘ్వహరము గొనుము. జీర్ణ శక్తి సరిగా నుండును. లివరు సరిపడినది. రాత్రిపూట మజ్జిగ కాక పోసికొని భుజింపుము' అనిరి. తంజావూరికి వచ్చి వేసితిని.