పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వృద్ధి బడయఁ జొచ్చితిని. దినదినము నరసింహము గారి యింటికి వెళ్ళి వారితోఁ గలసి యుపాసనము జరపు చుంటిని.

   ఆ నాళ్ళలో మద్రాసులో శేషయ్యంగా రను నొక వైష్ణవుఁడు తంజావూరు జిల్లా వా స్తవ్యుఁ డు ' ధ్రువనాడి' యను సంస్కృత గ్రంధము నుండి యనేకుల జాతకము చదువు చుండెను. ఆ యాచార్యుఁడు తొలుత చాల ననారోగ్య గ్రస్తుఁ డుగా నుండి శ్రీవారి శిష్యుఁడై కుంభకోణమున వసించి యారోగ్యవృద్ధి చెందెను. కాన మా గోష్టిలోని వాఁ డయ్యెను. ఆయన శ్రీవారి జాతకమును, మా గోష్ఠిలోని వారయిన యితరుల జాతకములను జదువు చుండెను. కొంత తద్వైచిత్ర కనుగొనుచు వింత చెందుచుంటిని.
   పదిరోజులు గడచి నేను గొంత తేరుకోఁగా నన్ను కృష్ణా జిల్లాలో గ్రంధార్జనమునకుఁ బొమ్మని మా పై యధికారి శ్రీ కుప్పుస్వామి శాస్త్రి గారు నామీది యనురాగము తోనే యాజ్ఞ యిచ్చిరి. వెంటనే నేనును, శ్రీ మానవల్లి రామకృష్ణా కవిగారును వెడలితిమి. కృష్ణ కాల్వల క్రొత్త నీటి స్నానపానములు మా కిద్దఱకును సరిపడలేదు. బందరు  నుండి రోడ్డు సైడు కెనాల్ నీటి లో పడవమీద చల్లపల్లి వచ్చితిమి.  కవిగారికి వేచిన జీడి పప్పన్న చాల ప్రీతి,  బందరులో  నది మంచిది దొరకును గాన వారు దాని నధికముగా గొని తెచ్చిరి. పడవలో కబుర్లు చెప్పుకొనుచు నిద్దఱము దానిని తింటిమి, నేను మితముగా, వా రమితముగా!ఆ రాత్రి కవిగారికి వాంతులు, విరేచనములు, జ్వరము,కలరా అనుకొం