పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆతఁడు లేచి నాకు మఱీ చోటిచ్చెను.' నేను తర్వాతి స్టేషనులో దిగిపోవుడును గాన యిఁక కూర్చుండను' అని నన్నుఁ గూర్చుండబెట్టి తానే తలుపు వేసి దగ్గఱ నిలుచుండెను. న న్నట్లు రక్షించినవారు గురుదేవులే యగుట. వారి ప్రజ్ఞాంశము నాలో నుండుట కాల క్రమమున స్పష్టముగా గుర్తింప నయ్యెను.

మద్రాసు చేరుదాఁ క నే నున్న చోటనుండి కదలక రైలు కంటె ముందుకు దూకుచున్న తలఁ పుల వేగముతో నిద్రమెలఁ కువలతో శాంత్యశాంతులతో మద్రాసు వచ్చితిని. వెంటనే మిత్రులను గలసికొని జరగిన సందర్భము లెల్లఁ దెలిపితిని. అవి వేసవి సెలవుల నాళ్ళు గాన మా బావ తో బుట్టులు మా గ్రామమునకు వెళ్ళి యుండిరి. మరల జనార్దనుని హొటలు లో భోజనము చేయుచు ఆఫీసులో అందఱు నా యనారోగ్యమును నెఱిఁగి యుండిన మిత్రులే కాన నా కట్టె తొందర కలిగింప కుండిరి. నాఁటి దాఁక నా యనారోగ్యము ను గూర్చి వంత చెందుచు నే నెక్కువ కాలము జీవింపఁబో నను కొనుచున్న నా మిత్రుఁ డొకఁ డు, ఆఫీసులో ఉద్యోగి కలరా వచ్చి యదాటుగా చనిపోయి నాకు చాల చింతఁ గొల్పెను. సాయంకాల మయిదు గంటల దాఁకఁ బని చేసి బడలి యింటికి వచ్చి సాయంకాలానుష్టానమున బడలిక తొలఁగి మరల నుత్సాహినై రాత్రి గడసి ఉదయోపాసనమున మఱింత తేఱి ఆఫీసుకు వెళ్ళుచు డిన క్రమమున నారోగ్య