పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

౨౮

నవజీవనము

నాఁటి రాత్రి శ్రీవారి ని దేశముచొప్పున మద్రాసుకు హాయిగా నే బయలు దేరితిని. కుంభకోణమున నుండి మాయవరము దాఁక రైలులో వచ్చితిని. పలువు రక్కడ దిగిచుండిరి. నేనును ఆ స్టేషనులో దిగి అక్కడ చాలాసేపు రైలాగును గాన ప్లాట్ ఫారం మిఁద కొంతదడవు నిటు నటు తడవాడితిని. రైలెక్కి తిని. అది బయలు దేరెను. నేను తలుపు దగ్గరనే నిలుచుంటిని. న న్నెవరో బయటికి పడఁద్రోయు చున్నట్లయ్యెను. మరల తొంటిరీతి కంపము, నిరుత్సాహము తోఁ చెను. తోడ్తో రైలు ద్వారము దగ్గఱ నున్న నాకు హరి ద్వారము తలఁ పునకు వచ్చెను. పాడు తలఁపు క్రిందికి దూకుదునా యనియుఁ దోఁచెను.

అల్లంతలో న న్నెవరో వెనుకకు నెట్టిచున్నట్లయ్యెను. ఇది నాలో జరుగుచున్న సదసద్వి వాదముగా గోచరించెను. పూర్వము కంటె నిప్పుడు గొప్ప జ్వాల లోపల వెలుఁగుచున్న ట్లయ్యెను. పూర్వ మెక్కడోమిణుకు మిణుకు మను నాశా జ్యోతి యుండెడిది. నే నీ సంకల్ప వికల్పములతో నిటు నటు నూగుచుండగా లోఁ గూర్చున్న సహృదయుఁ డొకఁడు భగవదావిష్టునట్లు తన ప్రక్క చోటు చూపుచు ' అయ్యా తలుపు తెఱచి యున్నది. క్రింద పడగలరు! ఇటు వచ్చి కూర్చుండుఁడు' అనెను. వెంటనే వెళ్ళి కూర్చుంటిని.