పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నది తెలుఁగు వచన రచనలో మెఱుఁగులను చూపునది యేగాక, యోగాధ్యాసాధకులలోను, మనశ్సరీరతత్త్వవేత్తలలోను, రోగ చికుత్సకులలోను సంచనము గల్గింపఁజాలినది నుండెడిది.

   కాని వారా గ్రంధరచన కుపక్రమించి యిపుడు ప్రకటింపఁ బడిన భాగమును పూర్తి చేయునప్పటికి శ్రీ తిరుపతి దేవస్ధానమువారొక మ్యూజియమును నిర్మించుభారమును వారిపై నిడిరి. దానికై వారు ఆహార నిద్రా సౌకర్యములు మాని, పులులు చెరలాడు కడప యడవుల కడ మొదలిడి కమ్యునిస్టు గెరిల్లాల కాటపట్టు లగు కృష్ణాజిల్లా ముక్త్యాల, నైజాము రాష్ట్రము నల్లగొండ గుట్టలవఱకును గాలించి కన్నుల పండువును గూర్చు సుందర జిన బుద్ధ హిందూ విగ్రహములను బెక్కింటిని తిరుపతి చేర్చిరి. 
   ఈ విగ్రహముల వలన మనకు పూర్వ మాంద్రదేశములో సమతాధర్మ ప్రతి పాదక ములు, అహింసా ప్రబోధకములు నైన జైన బౌద్ధములు ప్రబలె ననియు, తదనుయాయుల కళారా ధనా ఫలితముగ పెక్కు మనోహర విహార విగ్రహదులు వెలసె ననియు, కాలక్రమమున ప్రజలకు వర్ణా శ్రమాచారముల పై నను, వైదిక యజ్ఞ యాగాదుల పై నను చూపు మ్రొగ్గె ననియు, అపుడు వారు పూర్వ శిల్పనిర్మాణములను చేజేతుల రూపుమాపిరనియు, తమ నూతనా వేశమునకు లొంగని వారిని చిత్రవధ సల్పి రనియు తెలియ నగును. నాఁటి దౌర్జన్య హింసా కాండకును, తరువాతి శక ములలోని మహమ్మదీయుల విధ్వంసక చర్యలకును,