పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రూపక మగును. ఈ యోగ మట్టిత్మోధమును గోల్పుటకే.

బహిర్ముఖముగా సమాధానము తెలియఁగోరుచో,' అనంత శాస్త్రం బహువేదితవ్యం ' ఆయా శాస్త్రములును, దత్ కర్తలును బహుభేదముల వారు. అం వరిదిగ్రాహ్యమోతేల్చువలసినది మరలనాత్మోద్బోధమే. ఘట్టకుటీ ప్రభాత న్యాయమున నెల్లరునెట్లు గాని యాత్మోద్బోధములు నను వర్తింప వలసిన వారే,అనువర్తించు వారే కాక తప్పదు. బహిర్ముఖముగా లభించు విజ్ఞానమును దోడు చేసికొని యాత్మోద్బోధములు నందుకొనఁ గల్గినచో పరమార్ధముల సులువుగాఁ బడయ వీలు పడును.

ఆ నాఁటి సాయంకాలము నా చేతి వాపు చాల తగ్గినది. యోగ సాధనానంతరము రామజపము వలె కొంత దడవుత దేకా నుధ్యానము చేయఁబూనితిని. ఒడలెల్లమంటలెత్తినట్లయ్యెను. అది శ్రీ వారితో చెప్పితిని. నియత సమయములలో తక్క నితర సమయములలో నా యనుష్టానము చేయరా దనియు, ఏ దేని యావశ్యకత కల్గినచో నప్పుడొక క్షణము స్మరించినంత మాత్రమున దానికి జరగఁ దగిన సౌకర్యము జరుగు ననియు, నోటి మాటను చెవి విన్నట్టే మి యభ్యర్ధనముల నది వినఁగల దనియు, ఒక తూరి ప్రార్ధించి నంత నే సర్వసిద్ధముగా నను గ్రహింపఁ గా నది చూచుచుండ గా మరల మరల నడుగు టేల యనియు ననిరి. టెలిఫోనులో ఒక