పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

౨౭

శ్రీ మాస్టరుగారు

అప్పుడు శ్రీవారి జీవితచరిత్రము తెలిసి కొనఁ గోరి యక్కడి వారి నడిగితిని. పూర్వ మెప్పుడో శ్రీకృష్ణ దేవరాయల పాలన కాలమునఁ గాఁబోలు తెలుఁగు దేశమున నుండి తంజావూరి రాజ్యసంరక్షణకై విచ్చేసిన వారిలో వీరి పూర్వులు ముఖ్యుల నియు, కుంభకోణము, భగవద్ఘట్టమునఁ జాల యిండ్లు వీరి పూర్వులవే యనియు, వీరి పూర్వు లొకరు కావేరితీరమున కుంభకోణము ననే భక్తి పురి యను నగ్రహరము వెలయించిరనియు, వీరు బాల్యమున చాల ఐశ్వర్య వంతు లనియు, నప్పటికీ జాలినంత సంపత్తి కలవారే అనియు, ఇంటి పేరు కంచుపాటివా రనియు, శ్రీ వెంకా స్వామిగా రని శ్రీ వారినామ ధేయ మనియుఁ దెలిసికొంటిని. అప్పుడు వారికి సంస్కృతము తెలియనా యని యడిగితిని. సాంఖ్య యోగ వేదాంతాది శాస్త్రములు సంస్కృతమునే కలవు యాసంస్కృతము రాక యాయా శాస్త్ర విషయములు తెలియఁ గా దన్న తలఁపుతో నే నట్లడుగుట. వారికి సంస్కృతము రా దనియు చిన్న నాఁడాయాశాస్త్రాంశ ముల నాంగ్ల భాషతోఁ జదివి వాని సారార్ధ మెల్ల గ్రహించి రనియు, సంప్రదాయముతో శాస్త్రములఁ జదివిన వారి కంటె నెంతో యపూర్వార్ధము లెఱుఁగుదురనియు, నతిలోకానుభూతి లెన్నో యనుభవించి రనియు, శాస్త్ర పండితులతోడి వారినిగా వీరిని దలఁపరాదనియు, క్రమ