పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

౨౬

చేకూడుట

మరల సంజవేళ కక్కడివారు శిష్యులు పలువురు విచ్చేసిరి. భగవద్ఘట్ట మను పేరి కావేరీతీరఘట్టముననే శ్రీ వారి సన్ని వేశమున కెదురుగా వెలయుచున్న యోగ శాలలో ఎల్లరును గూడి యోగసాధన చేయుట జరగుచుండెను. చాలగా వాచి యున్న నా చేయి నాఁటి సంజ ప్రార్ధనమున నెంతో చక్క బడెను. వాపు తీపు తగ్గెను. నాలో లోలోపల నెక్కడో చిఱువెల్గు గోచరించు న్నట్టును స్వప్న ప్రాయముగా లీలగాఁ గొంత గోచరింపఁ దొడగెను. శరీరము బ్యాటరీ పెట్టి నరముల నెల్ల నూగించి వేసినట్టు గొప్ప యూపు కలిగెను. చేతులు వాని యంతట నవియే లేచి నమస్కరించెను. కాని కుడిచేత నింకను బాధ గోచరించుచుండెను. టక్కు టక్కు మని జబ్బు యెముక యదురు తెలియుచుండెను.

శరీరము నింత తీవ్రసంచలన మేమిటి? ఇది యెక్కడ నుండి యారంభమై జరగుచున్నది? ఇంతదాఁక నెన్ని శ్లోకములో, ఎన్ని మంత్రములో, ఎన్ని ధ్యానములో, ఎన్ని క్షేత్రములో, ఎన్ని దేవతాదర్శనములో, ఎందఱ యాశ్రాయ ములో జరపితిని గాని యిట్టి విశేష మెక్కడ గాని యెప్పుడు గాని జరగుట యెఱుఁగ నైతినే! ఒకతూరి ప్రార్ధన మాత్రముచే నింత జరగుట యేమిది? అస్తినాస్తి విచికిత్సా స్పదముగా నున్న