పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కలదు. శ్రీ శాస్త్రి గారిచే పరిరక్షితులై పెక్కు రిట్లే వారిని స్మరింతు రనుట కేవలము స్వభావోక్తి! వారి కరుణా ప్రసారముచే నుజ్జివితు లైనవారిలో నేనొకఁడను. ఆ కృతజ్ఞతను పురస్కరించికొని ఈ శ్రద్ధాంజలి నర్పింప సాహసించితిని. వ్యాధులను తపస్సుచే నివారించు టెట్లు? మరియు, ఒకవ్యాది నింకొక రుపశమిం పఁజేయు టెట్లు? అని పలువురు ప్రశ్నింతురు. ఇది న్యాయ్యమే. అట్టి యనుభవము పడయు వరకు నాకు నట్లే యుండెడిది. స్వయముగ నాకు దెలిసిన కొన్ని విశేషముల నుదాహరించి, సహృదలహములను రూపమున నాకు శ్రీ శాస్త్రిగా సత్యమదుర స్వభావ సంస్మరణావకాశమును, ఈ గ్రంధ రచనలో శ్రీ వారుద్దేశించిన ప్రయోజనము కొంతవఱకును చేకూరును.

   శ్రీ శాస్త్రిగారి 'ప్రజ్ఞా ప్రభాకర' రచనకు దొడగినప్పటికే భ్రుక్తరహిత తారక రాజయోగ మార్గమున ముప్పదేండ్లు సాధన మొనర్చి యుండిరి. ఈ సుదీర్ఘకాలమున నెన్నియో మహనీయాను భావములను వారు గడించిరి. తమ యనుభవములను, తమతోపాటు యోగదీక్షబడసినవారి యనుభూతులను, తమ వలన నుపకృతి బడసినవారి కధలను, వారు వేర్వేరు సంపుటములుగ బ్రకటింప నెచింరి. వారు సంకల్పించిన బృహగ్రంధమే రూపొందినచో  నది