పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రయాణములో, రైలులో,బండిలో, నడకలో ఇంకే మేని వ్యవహారములలో వర్తిల్ల వలసి వచ్చినప్పుడు సరియ యిన వేళ తప్పిపోకుండ ఒక క్షణ మాత్రము మనసున స్మరించినఁ జాలును. కార్యంతరములు తీఱి విశ్రాంతి దొరకి నప్పుడు జరగవలసిన సాధన మెల్ల జరగఁ గలదు.

వివేకమును సత్యమును ధర్మమును గుర్తించుకొనుచు నంత రాత్మ నారాధించుచు లోలోఁ జోచ్చుకొలఁదిని నీకు వలసిన యుద్బోధములు లభింపఁ గలవు. అట్టి యుద్బోధము లను నీవు నీలో నెక్కడ నుండి యెట్లు పడయు చుంటివో క్రమక్రమముగా ప్రసరించుచున్నది. అది లేక నీ వేమి గాని పడయఁ జాలవు. ముందు నీ కారోగ్యమే. తర్వాత నే యోగ సాధన ఫలము దొరకఁ గలదు. గాఢముగా విశ్వసించితి వేని, నీకు యోగ ఫలము లభింపఁగల దని నే ననుట లేదు. నీ కా విశ్వాసమును గొల్ప వలసిన వాఁ డను. నేనే. నీవు పరమార్దకుతూహలిగా నుండినఁ జాలును. యోగ సాధనము నాకలి గొన్న రిత్తక డుపుతో నుండి చేయరాదు. ఏదే నాహారము గొన్న పిదపనే చేయ వలెను. మద్రాసులో నీ యోగ మాగ్గమున నడచుచున్న మిత్రులు పలువు రున్నారు. తఱచుగా వారిని గలసికొను చుండుము. వీలు కలిగినప్పు డిక్కడికి వచ్చు చుండుము. ప్రధానముగా డిసెంబరు తుది వారమునను, మే తుది వారమునను, ఇక్కడ గోష్ఠి జరగును. అప్పుడు తప్పక రమ్ము'