పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నా సన్నిధి లాభము కొఱకే గదా! నేను సదా నీలో నుందును. నీకు వలసిన సహాయము నీలో నుండి జరపుచునే యుందును. ఇక్కడ నీ కే తీరున శరీరము సంస్కారము జరగుట గుర్తుకు వచ్చెనో, ఆ తిరుననే యెక్కడ నున్నను అనుభూతి గుర్తుకు రాగఁ లదు. ఉదయము జరపిన యోగ సాధనము శరీరము సాయంకాలము దాఁ క పని చేయుచునే యుండును. ఎప్పుడెప్పు డెం తెంత జరగవలెనో అంతంత జరుగును.

   నీలోని సంస్కారము జరపునది ప్రజ్ఞా కలిత మయిన చైతన్యము గాని జడశక్తి కాదు. అది యెలక్టిసిటీ వలె పని చేయునది గాదు. ఎలక్టిసిటీ హద్దు దాటి అక్రమముగా నుపయోగించుకోఁ గోరి నను అది యట్లు పని చేయదు. ఎంత చేయ వలెనో అంతే చేయును. కావలె నన్నను నీ వావశ్యకత కెక్కువగా కనులు మూసికొని యుండఁ జాలవు. లోపల నావశ్యకమయిన పని జరగుచుండఁ గా కనులు తెఱవను జాలవు. ఏ దేని యాకస్మికముగాకార్యాంతరముకలుగుటో, ఎవరేని వచ్చి పలుకరించుటో జరిగినను అప్పుడు విక్షేపము జరగు నని వెఱవ నక్కఱ లేదు.' ఇట్లు తొందర కలిగినది. దాని ననుభవింప వలసి యున్నది.' అని ప్రార్ధనాపూర్వకముగా నంత రాత్మకు విన్న వించుకొని యా కార్యము ముగించు కొన వచ్చును. అది ముగిసినంత నే జరగ వలసిన యోగ సాధన జరగఁ గలదు.