పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ననఁ గా నట్లు చేసితిని. పూర్వము తీవ్రమయున మందులు పుచ్చుకొంటిని. తదాది కడుపు ఉడికి పోవుచున్న ట్టుండును. నేఁ డది లేదు.' శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం' అని గాన నే నిక్కడ మి సేవకుఁడనుగానే యుండఁ గోరుచు న్నాను. ఇక్కడ నుండి యే జీవిక నేదేని సమకూర్చు కొందును. అనుగ్రహింపు' డంటిని.

   వారు నీ కిప్పుడు ' జీత మెంత?' అని యడిగిరి. ఏఁ బది రూపాయ లంటిని.' దీనితో నీవు నీ కుటుంబమును పోషించు కోవచ్చును. ఉన్న జీవికను మానుకొని యిక్కడ నుండ నేల?
   బండి నడచుచుండఁ గానే రిపేరు సాగవలెను. బండి ఊడఁ దీసి చేయునో బండి వాని జీవిక చెడును. అట్టిది నా యోగ మార్గము. సాగుచున్న ప్రవృతికి భంగము కలుగరాదు. ఇది నివృత్తి మార్గము కాదు. రాజయోగ మార్గము. గార్హస్ధ్యము ఉండ వలెను. సన్న్యాసి కారాదు. సౌఖ్య ముండవలెను. ఆహారాదులు సరిగా ససిగా కయికొను చుండవలెను.
   ఇట్టిచో నీవు యుద్యోగమున నండు టావశ్యకము. నీ యుద్యోగము నీ జీవిక కే కాక లోకమునకుఁ గూడ నుపకారకము. ఆరోగ్యవంతుఁ డవై నీ యుద్యోగమున నుండి తిన్నగా సాగించుకొనుచుండుము. నీ విక్కడ నుండఁ గోరుట