పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మిచ్చి సరిదిద్దిన డాక్టరు తర్వాత కొన్నాళ్ళ దాఁక నా చేతిని మెలి వెట్టి నలిపి చెఱపి ధనాశతో నన్నుఁ జాల పీడించి నాఁడు గాన యది చక్కబడకే యుండెను. ఆ జబ్బు గూటి కండలు గజిబిజి యయిపోయెను. అవి యెల్ల నిప్పుడు చక్క బడు చున్నవి గాఁబోలు నన్న సంతోషము నా కా చావు బాధను చేతి వాపును జూచి యక్కడి వా 'రది యేదో రెక్టిఫి కేషన్‌ జరగు చున్నది. వెఱవకు' మని తోడు పలుక సాగిరి. ఎన్నేండ్లనుండి యో నిద్రలేక కొట్టు కాడుచుండు వాఁ డను. నే నా నాఁటి రాత్రి కొంత హాయిగా నిద్ర పోయితిని.

మర్నా డుదయమున లేచి కాలకృత్యములు దీర్చు కొని యోగానుభూతికి సిద్దముగా నుంటిని. పూర్వదినపు సాయంకాలమున నా యూరిలోనివారనేకులు యోగసాధన మునకు వచ్చిరి. వా రెల్ల నా యుదయమునను వచ్చి యుండిరి. పూర్వదినము సాయంకాలము జరిగినట్లు నాకు నాఁ డుదయమున జరగెను. అప్పు డక్కడ నున్నవారిలో రాధాకృష్ణపిళ్ళ యని, మహాదేవయ్యారు అని యిద్దఱు ప్రధాన శిష్యు లుండిరి. వారు నా విషయమును శ్రీ వారికి విన్న వించిరి. అప్పుడు నా విషయము ' టెస్టు' తీయవలసి నదిగా వారు వారి కాజ్ఞాపించిరి.

ఆ విచిత్రవిషయ మెట్టిదో యానాఁడే నేను దొలుత తెలిసికొంటిని. నన్ను దగ్గఱ కూర్చుండు మనిరి. రాధాకృష్ణ పిళ్ళగారు గురుదేవులకు నమస్కరించి కనులు మూసికొని యొక నిమిష మాగి ఇంగ్లీషుతో గ్రంధము పఠించుచున్న