పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెఱపి యయ్యెను. శరీరముణ సచలనముతగ్గెను. అంతట మరల నమస్కరించి లేవవలసినదిగా దగ్గఱనే ఉన్న స్వాములవారు తెల్పిరి. లేచితిని. నా చేతికి (డిస్లో కేషన్) బండి నుండి పడుటవల్ల బాహు మూలాస్దిస్దానము తప్పి చాల సంకటపడుట తెల్పితిని.

వారది యా బాహు స్ధితి సరియయిన స్దానమునఁ జేర్చుటకై జరుగుచున్న ప్రయత్నమనియు, బాహుమూల మున కాయ స్వాస్ధ్యము లేకున్నచో కుడిచేయి కూడ పైకి లేచి నమస్కారము చేసెడి దనియు, ధ్యానావసానమున వాని యంతట నవిగా రెండు చేతులు లేచి నమస్కరించుట యీ యోగ విధానమున నపూర్వాద్భుతానుభూతి యనియు, నట్లు కూడుట యోగ శక్తి చేకూడుట కొక చిహ్న మనియు తెల్పిరి. జరగిన విషయమును శ్రీ గురుదేవులకు ని వేదింప వలసిన దనిరి. నేను శ్రీ వారి సన్నిధి కరిగి జరగిన దంతయుఁ దెల్పికొంటిని. వారు చిఱునవ్వు మోమున వెలార్చి తనివితో నుండు మని యా దేశించిరి.

అట్లు ధ్యానము జరిగిన తర్వాత నొక్క గంటసేపటికే నా దక్షిణ హస్తమూలము చాల వాచి బాధ గొల్పెను. టక్కు టక్కు టక్కు మనుచు ఱెక్క గూటిలో నేదో కదలిక శబ్దము వినవచ్చు చుండెను. వాపు, బాధ ఎంత యెక్కువగా నున్నను నా కది యాహ్లాదము నేకొల్పసాగెను. మూఁడు నాల్గేండ్లనుండి యా చేతితో ససిగా పనులు చేయఁ జాలక బాధపడుచుంటిని. ఆ నాఁడు చేతి యెముకను క్లోరోఫార