పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

౨౩

దివ్యదర్శనము

రైలు సాగెను. రైలు వేగమును మీఱి నా మనోవేగాముండెను. మర్నాడుదయము ఎనిమిది గంటలకు కుంభకోణము స్టేషనులో దిగితిని. కాలకృత్యములు తీర్చుకొని మంచి మామిడి పండ్లు కొనుకొని నరసింహముగా రిచ్చిన యడ్రేసుకు బండి మిఁద వెడలితిని. బండి వాఁడా యింటిని బాగుగా నెఱిఁగిన వాఁడు. త్రోవలో నాతఁ డు అక్కడి గురుదేవుల ఘనతను వర్ణింప దొడఁగఁగా తదాకర్ణనోత్సాహముతో నే నంతలోనే చేర వలసినచోటికిఁ జేరితిని.

ఒక సన్న్యాసి కాషాయధారి రోడ్డుమిఁదబండి నిలువు గానే చేరవచ్చి నా తెలుఁగు తీరు గుర్తించి ' యెవరు నాయనా నీవు? ఎక్కడ నుండి రాక? ఎందుకోసము?' అని తిన్నని తెలుఁ గు పలుకు బడితో ప్రశ్నించెను. నా న్నాలింగ నము చేసికొని బండి దించెను. ఆయన యాదుకొని నన్ను బండి దించినప్పటి పరితోషము నే నెన్నటికి మఱువఁ జాలను. నా చేతి పండ్ల బుట్ట పుచ్చుకొని వడిగాలోని కరిగి నా విషయములు శ్రీ వారి కెఱింగించి నన్ను దర్శనమునకుఁ దోడ్కొని పోయెను.

లావు గాక సన్నము గాక, పొట్టి గాక మఱీ పొడుగు గాక నిమ్మపంటిచాయతో అరుణోదయ కాంతులు కడల్కొల్పుచున్న శ్రీ వారిని జూడగానే నాయొడలు పులక