పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హరిద్వారము గాక ఆరోగ్యద్వారము చేరఁ బోవుచున్నట్లయ్యెను.'నేను'అను నా బాహ్యప్రజ్ఞ లోదిరిగి నట్లును,దానికి బాట పాయ లిచ్చి యేర్పడుచున్నట్లున్న దోఁచెను.ఎడమ ప్రక్క నుండి తేలి తేలి చెడుగు పోవుచున్నట్లును, గుడి ప్రక్క నుండి దూఱి దూఱి నడుమ నొక బాట యర టాకు నీనవలె సాగుచున్నట్లును దలఁపఁ జొచ్చితిని. ఒక ప్రక్క ఆఫీసుకు వెళ్ళ వలసిన తొందర. ఆ సమయమున మా లైబ్రరియన్‌ కు మిత్రుఁడు, మా నరసింహము గారికి మిత్రుఁడు నొక్కఁ డక్కడ నుండి నా గోడెల్ల విని 'రెండు రోజులు సెల విప్పించుటకు నేను లైబ్రేరియన్తో చెప్పి యేర్పాటు చేసెదను. నీవు కుంభకోణము వెళ్ళుము'అని క్రొత్తగా లీవు చీటి వ్రాయించి పుచ్చుకొని వెళ్ళెను.

నేను సాయంకాలము రైలు పయనమునకు సన్నద్దుఁడ నయితిని. నరసింహము గారు జాబు వ్రాసి యిచ్చిరి. రాత్రి యేడుగంటలకే నేను ఎగ్మూరు స్టేషనుకు వెళ్ళితిని. అక్కడ మా లైబ్రరి యరవపండితుఁ డుండెను. ఆతఁ డు నన్నుఁ జూచి చెయి పట్టుకొని 'నేఁడు ఆఫీసుకు రాక అయ్యో!ఇది యేమి? ఇక్కడ నగపడితిని?ఎక్కడికి పోవుట? మీ యింట చేర్చెదను. రండు. మతి స్వాస్ధ్యము తప్పి యిట్లగుచుంటిరా యేమి?యని పలవించెను.నేను దుఃఖించితిని. నా కడ నంత దాఁక చాల నడుకువతో వర్తిల్లుచిండిన వాఁ డు. దయనీయముగా నున్న నా