పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

౨౨

వెలుఁగుబాట

రోడ్డుమిఁద అబ్బూరి జగన్నాధరావుగా రను మిత్రుఁడగపడి నా చేయి పట్టుకొని 'మిరు ప్రభాకర శాస్త్రిగా రేనా?ఇట్టుంటి రేమి?'అని యడిగెను. మూఁడేళ్ళనుండి జబ్బుగా నుంటి నంటిని. ఏమి జబ్బు అనుచు నాతఁడు నన్నింటిలోనికిఁ గొనిపోయెను. శూన్యహృదయముతో నేను లోని కరిగితిని. అక్కడ శ్రీ గురజాడ అప్పారావు గారి ద్వారా నాకు మిత్రు లయిన వారు, అప్పారావు గారి బంధువు, మూఁడేండ్లకు ముందు అప్పుడప్పుడు నన్ను లైబ్రరీలోని యోగ శాస్త్ర గ్రంధముల గూర్చి యడుగుచుండు వారు నగు శ్రీ పోతు రాజు నరసింహము. ఎం.ఏ.'ప్రెసిడెన్సి కాలేజి ఫిలాసఫీ ప్రోఫిసరు ఆగపడిరి. వారి ప్రశ్నపై సూక్ష్మముగా నా యానారోగ్యము తెల్పితిని. వారి బావమఱఁది యగుజగన్నాధరావు నన్ను 'మా బావగారు చేరిన యోగ గోష్ఠిలో చేరిన మి యనారోగ్యము తొలఁ గిపోఁ గలదు గదా! ఏల చేరరాదు? 'అనిరి.నరసింహము గారు 'ధ్రువనాడి గూర్చి నేను వారిని ప్రశ్నించితిని. నా జాతకము ధ్రువనాడిలో నుండునా యని యడిగితిని. వారు గంపెడు విషయములు చెప్పిరి. నన్ను వెంటనే కుంభకోణము వెళ్ళి యోగ గోష్ఠిలో చేరఁగోరిరి. వెళ్ళుటకు సమ్మతించుచో జాబు యిత్తు ననిరి.