పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కారము లేకుండ చాల రుచ్యముగా కూరలు, పచ్చళ్ళు చేయించెను. ఆతఁడు మామూలుగానే చేయించె నేమో కాని నాకు మాత్రము నాఁటి భోజనము కొన్ని యేండ్లకు పూర్వ మెప్పుడయిన చేసియుందునో లేదో అన్నంత రుచ్యముగా నుండెను. కడుపార నారగించితిని. శరీరమున కుత్సాహము తోఁచెను. నరముల బలము చక్కబడినట్లయ్యెను.' నేఁ డాఫీసుకు పోయి పని చేయగల్గుదునా? జబ్బు కుదురునా? నేఁ డీ యుత్సాహ మేమి? ఏమో! డ్యూటిలో నుండఁజాలను. హరిద్వారము వెళ్ళ వలసినదే! గంగలోఁ గలయుట మాట అక్కడ నిర్ణయించుకొందును గాక!' ఇత్యాది విధముల యోచనలతో అక్బరు సాహెబు వీధిలో వచ్చుచుంటిని.

--- ---