పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సెలవు చీటి మిఁద వ్రాసిరి. వ రందాఁ క నెంతో యోర్మితో నన్ను నెలకొల్పుకొనఁ జూచిరి. లాభము తోఁప దయ్యెను. నాకును దిక్కు దోఁప దయ్యెను. బలవంతమున శరీరమును, నరముల శక్తిని ఎగసన ద్రోసికొని స్నానము చేసి హొటలుకు వెళ్ళితిని. నేఁటితో నౌకరికి నీళ్ళు దోడు కొనకవలసినదే! ఇట్టి స్దితితో ఇంటికి మరల వెళ్లుట బ్రదికియుండియుఁ జచ్చుట యగును. చేత నున్న సొమ్ముతో హరి ద్వారమునకు టిక్కెట్టు తీసికొని (టిక్కెట్టు కే చాలినంత ధన మున్నది కాన) మార్గమున నుపవాస మే చేసి ఏ దేని యాహార మెవ్వరి వలన నేని యాయుచితముగా లభించిన నారగించి మహా ప్రస్ధాన కల్పముగాఁ బోయి గంగానదీ ప్రవాహములోఁ గల యుదును గాకాని నిశ్చయించుకొంటిని. ఆత్మాహత్య యసుర్య నరక ప్రాపక మన్న చింత రేగెఁగాని పండ వాదుల మహా ప్రస్దానము పాపాపాదకముగాఁ గాక పాపాపనోదకముగాఁ జెప్పుబదుట గోచరించి సమాధి గూర్చెను.

క్యూరేటరుగారు డిస్మిస్ చేయునందాఁక నెందుకు? నేనే రిజిగ్నేష౯ చీటి పంపుదునుగా కని నిర్ణయించుకొని అట్టి చీటి వ్రాసి చేత నంచుకొంటిని. తొమ్మిదిన్నర గంటలకు భోజనము చేసి నౌకరి చెల్లు చీటిని నాతో పాటు నౌకరిలో చేరిన వాఁడు, నా యనరోగ్యమునకునాకంటె దుఃఖించుచుండువాఁ డు నగుమాస్తా యింటికి వెళ్ళి యిచ్చి వేయ నిశ్చయించు కొంటిని. హొటలుకు భోజనమునకు బోగాజనార్దనుఁడు జబ్బుగా నంటి నని నాకై ప్రత్యేకముగా