పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డిచ్చుట పూట కూళ్ళయింట నిచ్చిన ట్లగును. తర్వాత మీరు మీ గంతవ్యస్ధలము చేరి యే దేని పంపుదురు గా' కనిరి.

మద్రాసు చేరితిని. ఆఫీసు డ్యూటిలో ప్రవేశించితిని. అప్పుడు మిత్రులు కొంద ఱుం డుటచే సముద్ర తీరమున బక్కింగ్ హామ్ లాడ్జిలో నుంటిని. జనార్దన్ అను పుణ్యాత్ముఁడు హొటలు ప్రోపైటరు నాకు మిత్రుఁ డు. ఆతని హొటలులో భోజనము. డ్యూటిలో ప్రవేశించిన పదిరోజులకే అయిదు రోజులు కాషుయాల్ లీవు పెట్టితిని. రాత్రులందు నిద్ర రాదు. కడుపులో మంట. శరీరము తాపము. తీవ్రమయిన యశాంతి. అప్పుడు నా బాల్యమిత్రము శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారు కూడ నాతో నుండిరి. వారి తోడ్పాటుతో డాక్టరు లక్ష్మీ పతిగా రింటి కేగితిని. ఆయన సరిగా వ్యాధిని గుర్తించి కాని మందిచ్చు వారు కారు. ఎక్కువగా మందులు వాడక ఆహారవిహరాదుల చేతనే శక్య మయినంతవఱకు వ్యాధి నివారణ చేయఁ జూతురు. ఆయన కూడ నాకు చిర మిత్రము. నా వ్యాధి చరిత్ర మంతయు విని నరముల యుద్రేకము తగ్గుట కేదో మందు (బ్రొమైడు) ఇచ్చిరి. అది పుచ్చుకొనఁ గా ఒక రాత్రి నెమ్మదిగా నున్న దిగాని మర్నాడు శరీర మంతయు పట్లు విడిపోయిన ట్లయి లేవలేని స్ధితికి వచ్చితిని. ఆ మందు మాని వేసితిని.

ఇక నౌకరీ దుష్కర మని నిశ్చయించుకొంటిని. అప్పటికే క్యూరేటరుగా రిఁక నీతఁడు సెలవు కోరినచో డిస్మిస్ చేసి యింటికిఁ బొమ్మన వలసిన దే అని రెణ్ణాళ్ళకు ముందటి