పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరిషత్తు సంవత్సరోత్సవము గుంటూర జరగెను. నేను చాల గౌరవించు వేదము వెంకటరాయ శాస్త్రిగారి యాద్యక్షము మిత్రులు శ్రీ రామకృష్టకవిగారు నన్ను మద్రాసు రాఁ గోరి జాబు వ్రాసిరి. గుంటూరఁ గలసికొందు నని బదులు వ్రాసి యట్లె గుంటూరు వెళ్ళితిని. నేను మాటాడినది, చేసినది ఏమియు లేదు. అయినను ఆయుపన్యాసము వినికిడికి, ఎండలకు తాళఁ జాలక పోయితిని. మిత్రులు కనుపర్తి మార్కుండేయశర్మ గారి యింట విడిసి, తొట్టె సాన్నము చేసి కొంత స్వస్ధ్యము కూర్చు కొంటిని.

మిత్రుల ప్రోద్బలమున మద్రాసు వెళ్ళ నిశ్చయించు కొంటిని. ఇంటికి వెళ్ళి తగిన యేర్పాట్లతో నే నొక్కఁడనే బయల దేరితిని. ఆప్తులు, బంధువులు మంగళగిరి నరసింహ స్వామి దర్శనము చేసి పొమ్మని నిర్బధించిరి. భక్తిభరితముగా సంకీర్తనముల పాడఁ గల బ్రాహ్మణుఁ డొకఁడు నాతో వచ్చెను. మంగళ గిరి వెళ్ళితిమి. అక్కడ బాలాంబగా రను మహానియురాలు మా కాతిద్య మిచ్చెను. పానకము మొదలగు నైవేద్యములు చేయించితిమి పానక మారగింపు చేయించు నప్పుడు వెండి కవచములో నున్న మూర్తి తీరును గూర్చి నాకు యోచన. దానిని వెల్లడింపఁ గా దైవ పరిక్ష వలదని యక్కడి వారు నాకు హిత ముప దేశించిరి. స్వామి కేదో చెల్లింపఁ దలఁ చుకొంటిని గాని చెల్లింపలేదు.అది శ్రీ బాలంబ గారికి సమర్పింపఁ గోరిక ఈయబోగా నప్పుడా మెగారు ' మా యింట నాతిధ్యము గొని మి రేదో యిప్పు