పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

౨౧

వెలుఁగునీడలు

భవభూతిపునరుక్త మయిన యీశావస్యోపనిషద్వాక్యము " అసుర్యానామ తేలోకా అంధేన తమసావృతాః, తాం స్తే ప్రేత్యాభిగచ్చన్తి యేకే చాత్మహనో జనాః" అన్నది యాత్మహత్య సంకల్పజ్వాలలను జలార్చి వేయు చుండెడిది. కడుపసిప్రాయమున కనులు మూసికొని బోరగిల పడుకొని చూచుచుండినపుడు నేను "నే నని" నాలో గోచరించిన మినుకు గ్రుడ్డి వెలుఁ గే దూరమున గోచరించి జీవితాశోచ్చ్వాస మాడించుచుండెడిది.

మందులు మానితిని గనుక మావారు మంత్రముల కేసి దృష్టి సారించిరి. వారిని వీరిని పిలిపించి మంత్రజపము చేయింప నుద్దేశింపఁగా నేను వారింపఁ జొచ్చితిని. యా మంత్ర ప్రయో క్తల యోగ్యతలు నే నేఱిఁగినవే. కనుక వారిని బిలిపింప నొల్లనయితిని. నా యనారోగ్యమును నన్నడిగి విద్వాంసుఁడు గదా యని నేను చెప్పఁగా విని వేద శ్రౌత విద్వావిశారదుఁ డొకఁ డు ' ఏఁ బది రూపాయలు తెచ్చుకొని నా కిచ్చితి వేని నీకు మోహిని పట్టినది. దానిని తొలఁగింప గలను ' ఇత్యాదిగా నేదో చెప్పెను. ధిక్కని తెగడితిని. అనుదినము సహస్రగాయత్రి మంత్ర జపము చేయుచు నమాయ కుఁడుగా నందు వృద్ధ బ్రాహ్మణు నొకని- ఆయన కుమారుఁడు మాయూర స్కూలు మేష్టరుగా కొన్నాళ్ళుండెను - బిలి