పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీవారి యోగ జీవితమునకు సంబంధించిన యీ రచనము వారి ప్రధమ వర్ధంతి నాఁటికి వెల్వఱచుట మా సంకల్పము.

శ్రీ శాస్త్రి గారితో స్వయము నాకుఁ బదునై దేండ్లకు మించిన పరిచయము కలదు. 1939లో వారు మదరాసు విడిచి తిరుపతి వెళ్ళిన తరువాత మదరాసునకు వారు వచ్చునపుడెల్ల మాయింటనే బస చేయు చుండువారు. వారియోగ చికిత్స వలన నారోగ్యము పడసిన నాఁట నుండియుఁ బరుమభక్తితో నేను వారి ననువర్తించు చుండడివాఁడను. వైద్యులకుఁ గుదుర్పరాని రోగాములతో బాధపడుచున్నవా రెందఱో శ్రీ వారి యోగచికిత్స వలన నారోగ్యము పడసి యానందముతో నుండుట నే నెఱుఁగుదును.

వారి యాధ్యాత్మిక శక్తి యెంత పటిష్ఠ మో తెలుపుట కొక సత్య సంభవము నుదా హరింతును.

అన్నమాచార్యుల ప్రధమ వర్ధంత్యుత్సవము తిరుపతిలో మహా వైభవముగా సాగు చుండినది. మదరాసు ఉన్నత న్యాయస్దానమున ప్రధాన న్యాయమూర్తులు శ్రీ పాకాల వెంకటరాజమన్నారుగా రధ్యక్షత వహించిరి. రెండవదినమున సాయంకాలము శ్రీమతి టంగుటూరి సూర్యకుమారి పాటకచ్చేరి జరగుచుండినది. వేలకొలదిఁ జనము విఱుగఁబడి వచ్చియుండిరి. సభాస్ధలము క్రిక్కిఱిసి యుండినది వాతావరణమల్లకల్లోల ముగనుండెను. కాఱుమబ్బులు క్రమ్ముకొన్నవి. తుపాను వాయువులు వీవసాగినవి. ఉత్సవ ప్రాంగణ మంతయు దుమ్మెత్తి పోయు చుండెను. వేలకొలఁది జనము. స్రీలు, శిశువులు, వృద్ధులుపలువురుండిరి. ప్రాణభీతి! సభలోఁబెద్దగ్లోలయ్యెను. రసాభాసమగు నని శ్రీ శాస్త్రిగారు వెంటనే లేచి మైకు దగ్గఱకు వెళ్లి 'వర్ష మురాదు! మనమందఱము నేకమనస్కతతోఁ బ్రార్థించు చున్నప్పుడు తద్విరుద్ధముగా వర్ష మెట్లు రాఁగలదు. మబ్బులు విచ్చిపోఁ గలవు. గాలిహొరు తగ్గును. కూర్చుండుఁడు! వాన రాదు! రాదు! రాదు!' అని మమ్మాఱు నొక్కి చెప్పిరి. ఆశ్చర్యము! శ్రీ వారి దివ్య సంకల్ప బలమేమో కాని వెంటనే మబ్బులు తొలఁగిపోయినవి. గాలి హొరు తగ్గినది. వర్షము రాలేదు. కచ్చేరి జయప్రదముగా సాగింది. వారి యాధ్యాత్మిక శక్తి