పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చూచి 'ఇవి చాలా తేలిక డోసులో నున్నవి' యని వానిలో ప్రధానౌషద మొకటే నరములకు బలము గొల్పు నని, అది యొక సీసా పుచ్చు కొమ్మని చెప్పెను, అప్పడే దానిని గొని కయికొని మద్రాసు వచ్చితిని.

అది పుచ్చుకొన నారంభించి డ్యూటిలో జాయి అయితిని, రెండుపూటలాకే అది యొడలెల్ల మంట లెత్తించి నిద్ర పట్టనియక నరముల బిఱ్ఱ బిగించి యడరి పదున ట్లేగుర గొట్ట సాగించెను. 'భ్రష్టస్య కావాగతిః,అన్నట్టు అది మాని నంజుండ రావుగారిని మరల జూడజాలక ఇంకెవరేవారి దగ్గఱనో మంచి డాక్టర్ల దగ్గఱనెమందులు గయికోనం నారంభించితిని, అవి మఱి మఱి గగ్గోలు పఱచేను, తిరువాలి క్కేనిలో నాకు పరిచితుడగు నొక డాక్టరు 'ఫాస్పరస్' ప్రధానముగా గల మాత్రలు పది యిచ్చి 'ఈ పడి నిస్సంశయముగా కడముట్ట దినమునకు రెండు వొప్పన పుచ్చు కొని మఱి యగపడు ' మని చెప్పి పంపెను. మాద్రాసులోని మావారు పుచ్చుకొని తీరవలసిన దని నిర్భందించిరి, పుచ్చు కొన నారంభించి నప్పటినుండియు నోరు తాడియారిపోవుట ,రేయుంబవళ్ళసలే నిద్రలేకపోవుట, ఒడలెల్ల మంటలు మఱి యెక్కు వగుటయయ్యెను.

--- ---