పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఒకనాడు రాత్రి భోజనానంతరము శానిటోజన్పాలతో తీసికొన్న కొంతసేపటికే శరీరమున నరము లెల్ల క్రమము తప్పి ఎక్కువగా బిట్టుబిగించి యాడించివిడిచిన ఫిడేలు, విణతంత్రులవలె కదల్సితే కదలితే త్రుటితములయి పోవునట్టదరుపాటుతో సంకట పెట్టసాగెను. మంచము మీద నుండి యదిలించి ఎగగొట్టి క్రింద పడవేయు చున్నట్లు కాజోచ్చెను. ఆ రాత్రి యెల్ల నిద్ర లేక చాల బాధపడితిని, శానిటోజ మానివేసి చల్లని భోజనము చేయుచుంటిని, రాత్రులందు క్రమముగా కొంతసేపు నిద్ర పట్టసాగెను.

అప్పటికే రేన్నేల్లో మూన్నేల్లో కయికొన్న సెలవు ముగిసెను. దినదినము ఆంధ్రపత్రిక చదువుటలో నందు చదివిన యుద్దతివ్రతలు నన్నల్లు కల్లోలపఱచుట చెల రేగుచునే యుండెను. అయినను మా వాళ్ళలో కొందఱుజ్వరమూ తలనొప్పా, ఆకలి లేకపోవుటా, ఏ జబ్బు లేదు పిఱికితస ముతో ఇంట గూర్చున్నాడని నిందించుట నాకు దుస్సహముగా నుండెను, మా తల్లిదండ్రులు, అక్కగారు, భార్య ఏమియు ననజాలక దుఃఖించుచుండిరి, సాహసించి నే నోక్కడనే మద్రాసు వెళ్ళి డ్యూటిలో చేరుదును గాకని బండిమీద బందరు వచ్చితిని, ఒక మిత్రునింట నానాడుంటిని, గురువులగు శ్రీ వెంకటశాస్త్రిగారిణి దర్శించితిని వారితో, వారికి నాకు మిత్రుఁడును, డిగ్రీలు లేకున్నను ఆంగ్లవ్తెద్యము చేయుచు ప్రఖ్యాతుఁడుగా నున్నవాడును నగునొక వ్తేద్యని జూడ నరిగితిమి. అతడు నంజుండ రావుగారి మందుల ప్రిస్క్రిప్షన్ లు