పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

౧౯

అనారోగ్యము


అప్పటికి ప్రాచ్యలిఖిత పుస్తకశాలలో నాకు మంచి వేతనాభీవృద్ది ఏర్పడేను. మాధరను రాష్ట్రమంతటను ప్రాచీనగ్రంధములను సంపాదించుటకై కొంద ఱుద్యోగులను ప్రభుత్వమువారు నియమించిరి. అందు నన్నొక ముఖ్యునిగా నియోగించిరి, నేనందు ప్రవేశించితిని, కాని యీ యనారోగ్యముచే సెలవు పెట్టవలసినవాడ నయితిని ఆ గ్రందార్జన కార్యము పెక్కేండ్లు సాగునదే యయినను ఆ యుద్యోగముల టెంపోరరిగానే ఏర్పాటు చేసిరి, ఆ టూరింగు పార్టి కార్యకలాపము తోడ్తో ప్రారంభింపవలసినదిగా నుండెను నేను దిర్ఘనారోగ్యగ్రస్తుండ నగుచుంటిని కావున నన్ను తోలగించి యా యుద్యోగము నింకోకరి కిచ్చిరి, నేను పర్మనేంటు పోస్టుకే రివర్టయితిని సెలవు గయికోంటిని గనుక యింటికి వెళ్ళితిని మూడేండ్లు బాధపడితిని.

మదరాసులో నుండగా మార్చిమార్చి నంజుండరావు గారు పెక్కుమందు లిచ్చిరి, ఎన్ని యిచ్చినను గుణము కనుపడద య్యెను. ప్రత్యుత ఔషధము గయికొన్న యా పూటనే అది యనారోగ్యము నదికపఱెచునదిగా నగుచుండెను. 'ఔషధము లట్టెవలదు. శానిటోజన్, మాత్రము ఆహారముగ తిసికోనుచుండు ' మని నంజుండ రావుగారు చెప్పిరి ఇంటికివచ్చిన తోల్తటి దినములలో నది కొన్నాళ్లు తీసికొనసాగితిని.