పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

   ' వచ్చెను నేఁటి కర్వదగు వర్షము పుట్టువుఁ దొట్టి, గర్భముం
    జొచ్చుటదొట్టి నాకరయఁ జూచిన నేఁటి కె షష్టిపూర్తి, యీ
    వచ్చిన యేడు నిండిన ధ్రువంబుగఁ గాఁ గల షష్టిపూర్తితో
    నిచ్చట నాకుఁ గావలయు నిష్టికిఁ బూర్తియు సృష్టిపూర్తియున్.'

అని వేఁడి గురుదేవులను బ్రార్థించిరి. అపుడు ' నిన్నటివఱకు ప్రభాకరుఁ డవుగా నుండిన నీవు నేఁటి నుండి ప్రజ్ఞా ప్రభాకరుఁడవు. నన్ను గూర్చి వ్రాయఁగలయ్యోగ్యత నీకుఁ గలిగినది 'అనిశ్రీవారుద్బోధించినట్లుతెలియనయ్యెను. నాఁడేవారు' ప్రజ్ఞాప్రభాకరము' రచనమునకుఁదొడఁగిరి. తమకుఁ గలిగిన యోగానుభూతులను వివరించుచు వేయిపుటల గ్రంధముగాఁ దోలిసంపుటమును, నీయోగము వలన నుపకారము పడసిన మిత్రులమొక్కయు, శిష్యులయొక్క యుననుభవములను, వారే వ్రాసిన వానిని, వేయించుట గ్రంధముగా రెండవ సంపుటముగా 'ప్రజ్ఞా ప్రభాకరము'ను వెలయించుట వారి సంకల్పము. అందుకై తొడఁగి రచనము కుపక్రమించి కొంతవఱకు సాగించిరి. మిత్రులకడ నుండియు, నాప్తులకడ నుండియు, శిష్యులకడ నుండియు వారి వారి యనుభవములను దెలుపు వృత్తాంతములను గూడఁ దెప్పించిరి.

తలమునుక లగు కార్యకలాపములలో నెట్లో తీరిక చేసికొని శ్రీ వారీ గ్రంధరచనము ను దినమున కొక కొంతగా సాగించుచునే యుండిరి. కాని యన్నమాచార్యుల కిర్తనముల ప్రచురణము, తదుత్సవాదికముల నిర్వహణము, కుమారసంభవో త్తర హరివంశ వ్యాఖ్యానములు రచనము, తిరుపతిలో మ్యూజియమునకై యమూల్యవస్తువుల సేకరణము-ఇత్యాది కార్యకలా ములలో దలమునుక లగుచుండుటచే నీ గ్రంధరచనము నేఁడు ప్రకటించు చున్నంత వఱకు మాత్రమే కొనసాగినది.ఇంతలో మ్యూజియమున కయిన వస్తు సేకరణ ప్రయత్నమున వారు బౌతికమున వీడుటయు మా దుర దృష్టము! కడకు దుఃఖపుఁ బుక్కిలింతగా మాకు దక్కినది యీ గ్రంధము!