పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తారకరాజయోగా నుష్టానమున తర్వాత 1917 వ సంవత్సరమున చేర్చితిని. కాని వారు దుర్బలమయిన చిత్త వృత్తి కలవారు గాన యిందు శ్రద్ధాళువులు కారయిరి. దుస్సహ వాసముల మరగి సంపదా రోగ్యములను సంపూర్ణముగాఁ జెడగొట్టుకొనిరి. వారి భార్యగారు ముందుగాను, 1928 ప్రాంతముల గాబోలు వారును చనిపోయిరి.

కుమారస్వామి శాస్త్రి గారు చనిపోయిన పదవ నాఁడు నేను ధ్యానము చేసికొను చుండఁ గా నా కన్నుల యెదుట స్పష్టముగా గోచరమై చిఱునవ్వు నవ్వుచు ' నీ మంచి సహవాసమును దూరస్థుఁ డనుగా నుండుటచే కోల్పోయి నీ మాట వినక దుస్సహావాసము జిక్కి చెడితిని. శారీరక వాంఛలు నన్నట్టుగా నాకట్టుకొని పెడ మార్గమును బట్టించినవి. చక్కబఱుప సాధ్యము కాని తుచ్చ శరీరము తొలఁ గెను . ఇఁక నీ గోష్ఠిలో నేను సుప్రతిష్ఠితుఁ నుగా నుండును' అని లజ్జా గర్భితముగా పలికి నాతో ధ్యానమగ్నఁ డగుట కాన వచ్చెను. శీలము పవిత్రముగాకున్నను, ఉపకార ప్రకృతి యాతనికడ నసాధారణమైనదిగా నుండెడిది. ఆ ర్తతలో నున్నవారి కెందఱకో ఆతఁ డుపకరించెడి వాఁడు. తన కల్మినందుకుఁ గోల్పోయెను. ప్రధానముగా నాయెడ నాతఁడు నెఱపిన సౌహార్దవాత్సల్యములకే, ఆ సుగుణమునకే శాశ్వతముగా నా జీవు డుద్గతి నొందగ కానీ తపించుచుందును.

వారి యింట పదిహేనురోజుల కెక్కువకాలమే అప్పుడుంటిని. అంతలో మా తల్లిదండ్రులు వగైరా లింటికి వచ్చిరి.