పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

౧౬

వేంకటేశ్వరస్వామి దర్శనము

అప్పటి నా జీవితాశలు రెండు. మా తల్లిదండ్రు లేప్పుడో మ్రొక్కు కొన్న శ్రీ తిరుపతి వేంకటేశ్వర స్వామి ని దర్శించుట యొకటి. నాకు పసితనము నాఁట నుండియు దేవాలయముల కరుగుటగాని, అక్కడ స్వామి దర్శనము లభించునని నమ్ముట కానియిచ్చ్జ గొల్పని ముచ్చట. తిరువళిక్కేణిలో గాని మైలాపూరులో గాని దేవళములలోనికి స్వామిదర్శనార్ధమై యెన్నఁడు గాని నేనై వెళ్ళి యెఱుఁ గను. కానీ యప్పుడప్పు డేవో నా మనోభావనములను పద్యములతో తిరువళిక్కేణి పార్ధ సారధి స్వామి స్తుతిగా వెల్ల డించుట కలదు. యాట్టి వానికి నాకు తిరుపతి వేంకటేశ్వరస్వామి దర్శన మున ముచ్చట యంత తీవ్రముగా నేల కలిగెనో నాఁడు గుర్తింప గుదురలేదు.' కలౌ వేంకటనాయకః' అన్న శ్లోకాంశము నన్ను క్రమ్ముకొన్నది.

మే మందఱము మ్రొక్కు చెల్లించుకొనుటకు అనఁ గా చిరంజీవి మాతమ్మునికి శంకరున కుపనయనము స్వామి సన్నిధిని చేయుటకు బయలు దేరితిమి. మద్రాసునుండి బయలు దేరి తిరిపతికి వచ్చుటలో నిజముగా నాకు స్వామి సన్నిధి కే వచ్చుచున్నంత యుప్పొంగు. అఖిలాండ నాయకుఁ డగువాని, విశ్వమును విష్ణువును, వషట్కారుని, భూత భవ్య భవత్ర్పభువును కన్నులార కంతును గదా! ధన్యుఁ డ నగుదును గదా! అదుగో