పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

౧౫

టైఫాయిడ్

మైలాపూరునుండి ఎగ్మూరు మ్యూజియం బిల్డింగ్సులో నున్న ప్రాచ్యలిఖిత పుస్తకశా లకు రాకపోకలు సేయుట, యెడ తెఱపి నక్కడి సంస్కృతాంధ్రములను జసువుట, చదివి గ్రంధములలోని ముఖ్యవిషయములకు నోట్సు వ్రాసికొనుట, కొన్నింటి పత్రికలకు వ్రాయుచుండు ట చేయుచుంటిని. రేయుంబవళ్లు విశ్రాంతి యెఱుఁగ కుండ శ్రీ రామేశముగారు గ్రంధములు చదువు చుండుటను జూచు చుంటిని గాన నట్లు సాగింపఁ గోరిన పూర్వసుకృతము చేత వారికి సుకరముగా నుండెను గాని నాకది యసాధ్యము గానే ఉండెను. పగలు చదవిన గ్రంధముల యర్ధములు రాత్రులందు గోచరించుండెడివి. నిద్ర తగ్గెను నిద్ర పట్టనప్పుడెల్ల లేచి మరల జదువుచుండెడివాఁ డను. దౌర్బల్యము నిరుత్సాహము పెరుగఁ జొచ్చెను. ఇంటికి పోఁ దలచి ఒక నెల సెలవు తీసికొంటిని.

సెలవు తీసికొన్న మర్నాడే నాకు తీవ్ర జ్వరము వచ్చెను. డాక్టరుమందిచ్చుచుండె ను గాని జ్వరము హెచ్చుచునే యుండెను. నాల్గయిదు నాళ్ల యినతర్వాత నాతఁ డు స్వగ్రామమున కీతని పంపి వేయుఁడని మా బావగారితో చెప్పెను. నేను కదల లేని స్థితిలో నుంటిని. మిత్రు లయినపండిత గోపాలాచార్యులుగారికి కబురంపితిని. వారు వచ్చి చూచి ' నేను సుదూరమున నుంటిని. ఇక్కడి వైద్యుల దగ్గఱనే మండు గొనుట మంచి దేమో!